దిన ఫలాలు 12-03-2024

దిన ఫలాలు 12-03-2024

మేషం: వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుమానాలకి, అపోహలకి దూరంగా వుండండి. మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.


వృషభం: వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు.


మిథునం: శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.


కర్కాటకం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు తగినటువంటి హోదాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది.


సింహం: పనులలో ఏర్పడిన అవంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులు. అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరం. శుభవార్తలు.


కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు. ధనలాభం.


తుల: కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.


ధనస్సు:  కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. సోదరుల నుండి ఆస్తి లాభం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.


మకరం: ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మీ స్థాయి పరపతి పెరుగుతుంది.


కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.


మీనం: ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు తీరుతాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121