దిన ఫలాలు 13-02-2024

దిన ఫలాలు 13-02-2024

మేషం:  అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు.


వృషభం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు.


మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వాహన యోగం.


కర్కాటకం: శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.


సింహం: పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు.


కన్య: కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడు తుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. విద్యా, ఉద్యోగవకాశాలుపొందుతారు.


తుల: కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టు దక్కించుకొంటారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.


వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.


ధనస్సు:  ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు.


కుంభం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు.


మీనం: రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121