దిన ఫలాలు 13-03-2024

దిన ఫలాలు 13-03-2024

మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. పరీక్షలకు సన్నద్ధం అవుతారు.


వృషభం: మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. సంతానమునకు నూతన విద్యావకాశాలు. వాహన యోగం.


మిథునం: పనులలో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగప్రాప్తి.


కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. కాంట్రాక్టులు అందిపుచ్చుకుంటారు.


సింహం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కార్యజయం పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు సేకరణ.


కన్య: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి. శుభవార్తలు.


తుల: చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు.


వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు.


ధనస్సు:  కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకొంటారు.


మకరం: సంతానం నుండి విలువైన సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి.


కుంభం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ధనలాభం.


మీనం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121