దిన ఫలాలు 17-03-2024

దిన ఫలాలు 17-03-2024

మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు. తగాదాలకు దూరంగా వుండండి.


వృషభం: కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. వృత్తి, వ్యాపారాలు ఓ మోస్తారుగా సాగుతాయి. ఉద్యోగులకు కొంత అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం.


మిథునం: ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులు మీకు మొండి చేయి చూపిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.


కర్కాటకం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం.ఆరోగ్యం పట్ల మెలకువగా ఉండాలి. స్వల్ప ధన లాభ సూచన.


సింహం: చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. అనుకోని వ్యక్తులు తారసపడతారు.


కన్య: గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్త్రా లాభాలు పొందుతారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయకండి.


తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.


వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది.


ధనస్సు:  ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మానసికంగా ఆనందంగా ఉంటారు.


మకరం: వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రుణభారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంనకు విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.


కుంభం: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.


మీనం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. శుభవార్తలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121