దిన ఫలాలు 21-03-2024

దిన ఫలాలు 21-03-2024

మేషం:  పనులు చకచకా సాగుతాయి. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి.


వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.


మిథునం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు.


కర్కాటకం: భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.


సింహం: మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.


కన్య: ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.


తుల: భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు.


వృశ్చికం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు లాభం.


ధనస్సు:  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి.


మకరం: సంతానంకు నూతన ఉద్యోగ లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.


కుంభం: దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. జీవితభాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి.


మీనం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121