దిన ఫలాలు 21-11-2023

దిన ఫలాలు 21-11-2023

మేషం:  చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


వృషభం: మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. సాంకేతిక విద్యావకాశాలు.


మిథునం: బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.


కర్కాటకం: విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.


సింహం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగావకాశాలు.


కన్య: పెద్దల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తులాభం.


తుల: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం.


వృశ్చికం: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా వుంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వాహనయోగాలు. పాతమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


మకరం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. పెట్టుబడులకు తగిన సమయం.


కుంభం: ముఖ్యమైన పనులలో సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వస్తు, వస్త్రా లాభాలు పొందుతారు.


మీనం: దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకుపరుస్తాయి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లాబ్ది పొందుతారు. షేర్లు, క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121