దిన ఫలాలు 23-11-2023

దిన ఫలాలు 23-11-2023

మేషం:  ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు కొనుగోలు.


వృషభం: విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. గృహ, నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.


మిథునం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు.


కర్కాటకం: కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది.


సింహం: భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాతమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంధానం నాకు నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహన యోగం.


కన్య: వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. సోదరుల నుండి శుభఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం.


తుల: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. ప్రయాణాలు రద్దు చేసుకొంటారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. సోదరుల నుండి సహాయసహకారాలు అందుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.


వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వాహన కొనుగోలు.


ధనస్సు:  నూతన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.


మకరం: రుణ బాధల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


కుంభం: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఆభరణాల కొనుగోలు చేస్తారు.


మీనం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానంనకు సాంకేతికవిద్యావకాశాలు పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121