దిన ఫలాలు 23-12-2023

దిన ఫలాలు 23-12-2023

మేషం:  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.


వృషభం: అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.


మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు.


కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు.


సింహం: అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచార అందును.


కన్య: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.


తుల: భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి.


వృశ్చికం: సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.


మకరం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. రుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు అందివస్తాయి. కొంతమంది వ్యక్తుల మాటల వల్ల కొద్దిపాటి నిరాశ ఏర్పడుతుంది.


కుంభం: నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆనందం కలిగిస్తాయి. విందు, వినోదాలు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.


మీనం: ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా వుండును.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121