దిన ఫలాలు 24-03-2024

దిన ఫలాలు 24-03-2024

మేషం:  ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు. వస్తు లాభం.


వృషభం: దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఊరట కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు. శుభవార్తలు వింటారు.


మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది.


కర్కాటకం: బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. విందు, వినోదాలు, సంతానం నాకు యత్న కార్యసిద్ధి పొందుతారు. వస్తు లాభ సూచన.


సింహం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. మానసిక ఒత్తిడి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. స్వల్ప ధన లాభాలు.


కన్య: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి డబ్బు చేతికి అందుతుంది.


తుల: ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. అనుకోని వ్యక్తులు తారసపడతారు.వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి.


వృశ్చికం: వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యా రంగంలో రాణిస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.


ధనస్సు:  ఆర్థికపరమైన ఒత్తిడుల నుండి బయటపడతారు. ఇంట్లో శుభకార్యముల ప్రస్తావన ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి.


మకరం: నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్హకాలిక విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.


కుంభం: ముఖ్యమైన ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృథా ఖర్చులు ఎక్కువవుతాయి.


మీనం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచనలు చేస్తారు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121