దిన ఫలాలు 25-01-2024

దిన ఫలాలు 25-01-2024

మేషం:  పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.


మిథునం: శ్రమాధికం ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.


కర్కాటకం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు.


సింహం: సన్నిహితులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం నుండి ధనలాభం. ప్రయాణాలు లాభిస్తాయి.


కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమతప్ప ఫలితం ఉండదు. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.


తుల: నూతన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా మిత్రుల సాయం పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఒడిదుడుకులు తొలగును.


వృశ్చికం: అరుదైన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర కొనుగోలు.


ధనస్సు:  సమస్యల నుండి బయటపడతారు. ఆప్తులను కలిసి సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


మకరం: ఋణవత్తిడులు కొంత వరకు తీరుతాయి. ఇంటిలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయం సహకారాలు అందుతాయి. ధన, వస్తు, లాభాలు.


కుంభం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు.


మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలలో చురకుగా పాల్గొంటారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121