దిన ఫలాలు 25-12-2023

దిన ఫలాలు 25-12-2023

మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి. వాహాన సౌఖ్యం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.


వృషభం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ముఖ్యమైన శుభవార్తలు వింటారు.


మిథునం: చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు.


కర్కాటకం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనని ఆచరణలో పెడతారు.


సింహం: చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ధన లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి . ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.అరుదైన ఆహ్వానాలు అందుతాయి.


కన్య: మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వస్తు, వస్త్రా కొనుగోలు.


తుల: ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు.


వృశ్చికం: పనులలో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నుండి విలువైన సమాచారం అందుకొంటారు. వాహన యోగం సూచిస్తుంది. శుభవార్తలు వినగలుగుతారు.


ధనస్సు:  కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. విందు, వినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం. సోదరుల కలయిక.


మకరం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైన మిత్రుల సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.


కుంభం: శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాదాలు తీరి ఊరట చెందుతారు.


మీనం: వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు కొనుగోలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121