దిన ఫలాలు 28-01-2024

దిన ఫలాలు 28-01-2024

మేషం:  ఉద్యోగస్తులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలలో అనుకోని పాత మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి.


వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్ధికాభివృద్ధి కంటికి కనిపిస్తుంది.


మిథునం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల విభేదాలు ఒక కొలిక్కి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు.


సింహం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.మానసిక ఆనందంతో వుంటారు.


కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. జీవితభాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. విద్యావకాశాల వివరాలు తెలుసుకుంటారు.


తుల: పనులు సజావుగా సాగుతాయి. వ్యత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సంతానంనకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది.


వృశ్చికం: గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకొంటారు. వాహనయోగం కలుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. ప్రయాణాలలో తొందర పాటు నిర్ణయాలు వద్దు. విద్యార్థులకు శ్రమ అధికం.


మకరం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన హోదాలు లభిస్తాయి. వాహన యోగం గోచరిస్తున్నది. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.


కుంభం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు, కార్మికులకు ఉన్నత హోదాలు, అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి.


మీనం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలుకువలు అవసరం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121