దిన ఫలాలు 28-12-2023

దిన ఫలాలు 28-12-2023

మేషం:  చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కృషి ఫలిస్తుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.


వృషభం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. అనుకోని అవకాశాలు అందిపుచ్చుకుంటారు.


మిథునం: ఋణవత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సాయం అందుతుంది. వివాదాలకు దూరంగా వుండండి. శ్రమాధికంగా వుంటుంది. సోదరుల నుండి ధనలాభం.


కర్కాటకం: దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు.


సింహం: ఇంటర్వ్యూలకు హాజరువుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తులాభం.


కన్య: సన్నిహితుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.


తుల: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.


వృశ్చికం: ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు, ఉద్యోగాలలో స్థాన మార్పులు వుంటాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం.


ధనస్సు:  దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.


మకరం: ఋణాలు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. శుభవార్తలు.


కుంభం: గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరుల కలయిక. ఆరోగ్యం విషయాలలో నిర్లక్ష్యం తగదు.


మీనం: ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సంతానమునకు నూతన అవకాశాలు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121