దిన ఫలాలు 29-03-2024

దిన ఫలాలు 29-03-2024

మేషం:  చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.


వృషభం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని వ్యక్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.


మిథునం: నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు.


కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.


సింహం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక ఆనందం కలిగిస్తుంది.


కన్య: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు.


తుల: ఎంత కష్టించినా ఫలితం కష్టమే. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


వృశ్చికం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి.


ధనస్సు:  కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. భూతగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


మకరం: సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు.


కుంభం: ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


మీనం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. యత్న కార్యసిద్ది పొందుతారు. స్వల్ప ధన లాభం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121