దిన ఫలాలు 30-01-2024

దిన ఫలాలు 30-01-2024

మేషం:  వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.


వృషభం: గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు ముఖ్యం.


మిథునం: శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు అందుకుంటారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు.


కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రత్యేక హోదాలు పొందుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది.


సింహం: ఉద్యోగాలలో స్థాన మార్పులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకొంటారు. సోదరుల నుండి ఆర్ధిక లావాదేవీలు సఫలీకృతం అవుతాయి.


కన్య: కార్యజయం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది.


తుల: కీలక వ్యవహారాలలో ఎదురైన ఒడిదుడుకులు, ఆటంకాలు తొలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల కలయిక ఆనందం కలిగిస్తుంది.


వృశ్చికం: వృత్తి-వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకి ఉన్నత పదవులు పొందుతారు. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.


ధనస్సు:  ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సంతానంనకు నూతన ఉద్యోగ ప్రాప్తి.


మకరం: ఉద్యోగాలలో స్థానచలనం గోచరిస్తున్నది. జీవిత భాగస్వామితో మాటలు స్వల్ప వివాదాలకు దారి తీస్తాయి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు సద్దుమణుగుతాయి.


కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.


మీనం: వృత్తి-వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూల పడతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121