దిన ఫలాలు 31-12-2023

దిన ఫలాలు 31-12-2023

మేషం:  చేపట్టిన కార్యక్రమాలు అనుకున్నసమయానికి పూర్తి చేస్తారు. అనుకోని అవకాశం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభం.


వృషభం: బంధవులతో ఏర్పడిన విరోదాలు పరిష్కారమై ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. మిత్రుల నుండి సహాయం అందుకుంటారు. సంతానం నుండి ధన లాభం. ఆహ్వానాలు అందుకుంటారు.


మిథునం: జీవిత భాగస్వామితో అకారణ విరోదాలు ఏర్పడవచ్చు. మాటల సందర్భంలో నిదానం అవసరం శ్రమ పెరుగుతుంది. బాద్యతలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభం సూచిస్తుంది.


కర్కాటకం: మిత్రుల ద్వారా ధనలాభం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు ఆనందం. కలిగిస్తాయి. ప్రముఖుల కలయిక విందు, వినోదాలు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందులు, వినోదాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.


సింహం: వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు వుంటాయి. సంఘంలో గౌరవం పొందుతారు. దూరపు బంధవుల నుండి శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి.


కన్య: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండటం మంచిది. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. వస్తులాభం. సన్నిహితులతో సరదాగా గడుపుతారు.


తుల: భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సాయం అందుతుంది. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


వృశ్చికం: ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంతానమునకు నూతన ఉద్యోగావకాశాలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు.


ధనస్సు:  దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రుల నుండి వత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో తొందరపాటు వద్దు. సోదరులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు.


మకరం: కష్టానికి ఫలితం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించండి.


కుంభం: దూరప్రయాణాలు లాభిస్తాయి. బందువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. అరుదైన ఆహ్వానాలు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.


మీనం: బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విందు, వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121