వార ఫలాలు 24-09-2023 నుండి 30-09-2023 వరకు

మేషం: ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా లేదా కార్యాలయంలో కానీ, శత్రువుల బలం తగ్గే అవకాశములు సూచిస్తున్నాయి. ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు వున్నాయి. ఏది ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఒకవేళ  ఏదైనా సమస్య వచ్చినప్పటికీ మీరు ఆ సమస్యను అధిగమించగలరు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. 

వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వ్యవహారములు పట్ల అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. అధికారవృద్ధి వుంది. అయితే విపరీత మైన నమ్మకానికి పోయి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మాట్లాడకండి. కుటుంబములో భేదాభిప్రాయములు వచ్చే అవకాశములు గోచరిస్తున్నాయి. మీరు తాత్కాలికంగా అన్న మాటలు, మీలో తప్పులు ఎంచి చూపేవారికి  బలమయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. 

సాఫ్ట్ వేర్ రంగం వారు కొంచెం ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది. అనవసరమైన శ్రమ ఉండే  అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతతను ఏర్పరచుకోండి. మీ మనసుకు ఆందోళన కలిగించే విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయములు వచ్చే అవకాశాలు వున్నాయి. జాగర్త వహించిండి.

ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. అయితే మీరు ఏది మాట్లాడిన బంధు వర్గంలో మాట పడవలసి రావచ్చు. నిత్యం గణపతి స్తోత్రం కుబేర కుంకుమ తో అమ్మవారికి పూజ చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం.  నూతన ఉద్యోగావకాశముల కొరకు ప్రయత్నించే వారికీ అవకాశములు బాగుంటాయి.


వృషభం: ఉద్యోగస్తులకు ఈవారం సానుకూలంగా యధావిధిగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మీరు సాఫీగా ఉన్నప్పటికీ శత్రువర్గము నుండి ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఏ పని చేసిన ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయానికి అశాంతికి గురవుతారు. కోపం తగ్గించుకోవడం మంచిది. సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ దాని వలన మీ విచక్షణ కోల్పోవడం మంచిది కాదు అది మీ అభివృద్ధికి ఇబ్బంది కావచ్చు. ఎవరు ఏమి అన్న మీరు తీసుకునే నిర్ణయం వల్ల పురోగతి బాగుంటుంది. అధైర్య పడకండి. సానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి.   

ఆరోగ్య పరంగా బాగుంటుంది. స్నేహవర్గం సహాయ సహకారములతో కొంత ఊరట చెందడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈవారం బాగుంది అని చెప్పవచ్చు. అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. క్రయ విక్రయాలు సానుకూలత ఉంటుంది. ఇంట బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ చిరునవ్వుతో సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతారు. మీ వ్యూహ రచన ఎవరికీ అర్థం కాదు. మీ మీద మీకు వున్నా నమ్మకం వల్ల ఎవరు ఎన్ని ప్రత్యత్నాలు చేసిన మిమల్ని ఏమి చేయలేపోతారు. బయట మీ గౌరవం మీ యొక్క మాటకు విలువ పెరగడం జరుగుతుంది.

ఆరోగ్య పరంగా శారీరక సమస్యల కంటే చిన్న పాటి మానసిక ఆందోళనలు, టెన్సన్స్ వంటి ఉండే అవకాశములు ఉన్నాయి. కంగారు పడకండి.  వారం ప్రథమార్ధం లో మొదలు పెట్టిన పనులు ద్వితీయార్థంలో వచ్చేసరికి అనుకూలమైన శుభ ఫలితములను ఇస్తాయి.  కళాకారులకు, సినిమా రంగం వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, చిన్న చిన్న పరిశ్రమలకు మంచి అనుకూలమైన సమయం సమయం అని చెప్పవచ్చు. 

ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న ఆటంకాలు వుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి  టెన్షన్ పడకండి. నిత్యం ఖడ్గమాలా స్తోత్రం పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు కొంత టెన్సన్స్, ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మంచి స్నేహము జీవితానికి మంచి పునాది ఈవిషయం గుర్తు ఉంచుకోండి.


మిథునం: ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి.  ఏ పని చేసిన నిదానంగా సాగుతుంది.  మీరు చేసే చిన్న చిన్న పనులవల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు జాగర్త వహించండి. ఏదైనా  చిన్న పొరపాటు చేస్తే మీ పైఅధికారులు కానీ, సహా ఉద్యోగాస్తులు కానీ అది ఆసరాగా తీసుకుని అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వృత్తి, ఉద్యోగములు విషయాల యందు జాగ్రత్త వహించండి.  

వ్యాపారస్తులకు ఈవారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు  తక్కువగా ఉంటుంది. పార్టనర్స్ మధ్య అంతర్గత  విమర్శలు తప్పవు. మానసిక ఆందోళనలు ఉంటాయి. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని తెలుసుకుంటారు. ఏది ఏమైనా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. నిత్యం మీద దక్షిణమూర్తి స్తోత్రం పటిచడం చెప్పదగిన సూచన. దాని వలన కార్య సిద్ధి లభిస్తుంది. 

బంధువర్గంలో, స్నేహవర్గంలో కూడా మాట పట్టింపులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. అయితే  జీవిత భాగస్వామి, కుటుంబం నుండి ఆదరణ, సౌఖ్యం లభిస్తుంది. పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించండి. కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆహారం విషయంలో శ్రద్ద వహించండి. 

ఈవారం స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు, ఉద్యోగస్తులకు కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. చేయని తప్పుకు నింద పడవలసి రావచ్చు జాగర్త వహించండి.  వ్యాపారం చేసేవారికి మంచి పురోగతి ఉంటుంది.  ఆటంకాలు వున్నా అధిగమించి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి నిత్యం గణపతి  గకారక  స్తోత్రం పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి.  విద్యార్థిని విద్యార్థులకు ఈవారం ఆటలు, కల్చురల్ యాక్టివిటీస్ లలో మంచి విజయములు ఉండే అవకాశములు ఉన్నాయి.


కర్కాటకం: అభివృద్ధి ఉన్నప్పటికీ ఎదో తెలియని ఆలోచనలు వెంటాడుతున్నట్టు ఉండే అవకాశములు ఉన్నాయి. ప్రతీ పనికి అనవసరమైన శ్రమ పడవలసి ఉంటుంది. ఉద్యోగం పట్ల అధికారం అభివృద్ధి అవుతుంది. మీరు దానిని బాధ్యతగా భావిస్తారు, అయితే పనులు వాయిదా పడే అవకాశములు ఉన్నాయి, కానీ నష్టములు ఉండవు. ఆందోళన చెందకండి. గోచార రీత్యా అర్దాష్టక శని నడుస్తుంది వలన పనులు నిదానంగా సాగుతాయి. ఎప్పటికప్పుడు పనులను పూర్తి చేయడం మంచిది. వ్యూహంతో మీరు రచించిన వ్యూహాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆచి తూచి అడుగు వేయడం చెప్పదగిన సూచన.

అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న అపవాదులు ఉండవచ్చు.  కుటుంబ పరంగా నూతన వస్తువు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ  కృషి,పట్టుదల సఫలీకృతం అవుతాయి. అష్టమ శని కారణంగా మనోవేదన, అంతర్గత సమస్యలు తప్పవు. వారం ద్వితీయార్థంలో జాగ్రత్త వహించండి. పనులు కొంత వాయిదా పడే అవకాశములు ఉన్నాయి.  ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ , స్టీల్, సినీ రంగం వారికీ కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. 

విద్యార్థినీవిద్యార్థులకు  మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇప్పుడు కష్టపడిన దానికి తప్పకూండా అనుకూలమైన ఫలితములు  ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు అనుకూలిస్తాయి, అయితే చిన్న పాటి వాయిదాలు ఉండే అవకాశములు ఉన్నాయి. కష్టే ఫలి అన్నట్టుగా అవుతుంది. మీరు అశ్రద్ధ చేసి తరువాత భాధ పడేటట్టు ఉండకండి. ఈవారం స్త్రీలకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదొడుకులు వుండే అవకాశం గోచరిస్తోంది. ప్రతి చిన్న పనికి శ్రమ అధికమౌతుంది. జీవిత భాగస్వామి తో ఇబ్బందులు ఏర్పడవచు జాగర్త వహించండి. 


సింహం: ఉద్యోగస్తులకు ఈవారం సాధారణంగా ఉండే అవకాశములు ఉన్నాయి. పని వత్తిడి వుండే అవకాశం వుంది. పనికి తగ్గ శ్రమ లభించక పోవడం మీ మనోవేదనకు గురి చేస్తుంది. ఒక్కోసారి ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలినిపిస్తుంది. అయితే మీ మంచితనం వల్ల వెళ్లలేక పోతారు. నమ్మిన సమస్తకి న్యం చేయాలి అనుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగర్త వహించండి. 

వ్యాపారస్తులకు కొంత నష్టములు, అశాంతి ఉండే అవకాశములు ఉన్నాయి. అనాలోచిత ఖర్చుల వలన ఆర్ధిక ఇబ్బందులు ఉండవచ్చు. నిర్ణయములు తీసుకోవడంలో చంచలత్వం ఉండే అవకాశములు ఉన్నాయి. వ్యాపార వ్యహారాలు విషయలంలో ప్రతి పని మీరు చూసుకోవాలి, లేకపోతె నష్టం వాటిల్లే పరిస్థితి గోచరిస్తోంది.

ఎక్కువ ఆలోచన చేయడం మంచిది కాదు. ప్రశాంతంగా  ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. బంధువుల వలన కానీ, స్నేహితుల వలన కానీ వారి మాటలు విని నష్తపోయే అవకాశములు ఉన్నాయి. ఇతరుల సలహాలు వినడం కంటే మీ సొంత ఆలోచనలు, నిర్ణయములు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు, లేదా అవాంతరాన్ని ఆపవచ్చు. 

ఒక్కోసారి అనుకున్న పనులు వాయిదా వేసుకోవడం కూడా మంచిదే అని నిర్ణయానికి వస్తారు. ఏ విషయంలో కూడా పట్టుదలకు పోవడం మంచిది కాదు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ధైర్యం పెంచుకోండి.  విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల యందు టెన్సన్స్ మంచిది కాదు. కృషితో, పట్టుదలతో ముందుకు సాగండి.  నిర్లక్ష్యం పనికి రాదు. ఈవారం స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఎదురయినా అతి కష్టం మీద పనులు నెరవేరుతాయి. ఎంత పెద్ద పనయినా మీ ఆలోచన శక్తి తో ముందుకు సాగుతారు. ఏ విషయమైనా జీవిత భాగస్వామి తో చర్చించి  నిర్ణయాలు తీసుకోండి.


కన్య: ఆనుకున్న దాని కంటే కొంత ఆలస్యంగా ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితములు ఉండవచ్చు. అధికారులతో ప్రతికూల వాదనలు, వృధా ప్రయాసలు ఉండే అవకాశములు ఉన్నాయి.  ఉద్రేకాలకు పోయి తగాదాలకు వెళ్లడం మంచిది కాదు. ప్రతి పనిని నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో మార్పులుకు ప్రయత్నములు అంత మంచిది కాదు. అంత అనుకూలమైన అవకాశములు ఉండకపోవచ్చు ఈవారం. 

స్నేహితులతో, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ వల్ల కాకపోయినా ఇంటిలో వేరే సమస్యలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. ఏ విషయం గురించి అయినా అతిగా ఆలోచించడం పట్టుదలకు పోవడం మంచిది కాదు.  వ్యాపారస్తులకు ఆర్ధిక పరంగా లాభములు మిశ్రమంగా ఉంటాయి. ఆనందపడేంత లాభములు లేనప్పటికీ నష్టములు ఉండే సూచనలు తక్కువగా ఉన్నాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. హెర్బల్ మరియు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. బిజినెస్ పార్టనర్స్ మధ్య చిన్న పాటి మనస్పర్థలు వచ్చే అవకాశం వుంది జాగర్త వహించండి. 

 ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.  మానసిక అలసట, అశాంతి చోటు చేసుకుంటాయి. కోపాన్ని నియంత్రించుకుని ఉండడం మంచిది.  విదేశాలకు వెళ్లే ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి. కొంత కృషి అవసరం. ఈవారం స్త్రీలకు సామాన్యంగా వుంది అని చెప్పవచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆరోగయం పట్ల జాగర్త వహించండి.  జీవిత భాగస్వామి తో సంతోషంగా కాలం గడుపుతారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది.


తుల: సంతాన పరంగా అనుకూలత లభిస్తుంది. వారి అభివృద్ధి ఎదుగుదల మీకు సంతోషాన్ని కలుగచేస్తుంది.  ఉద్యోగస్తులకు కూడా సానుకూలత ఉంటుంది. కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం వుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నములు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఈవారం మంచి లాభాలు ఉండే అవకాశములు ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కొత్త పనులకు ఇది మంచి సమయం కాదు. పెండింగ్ లో వున్నా పనులను త్వరగా పూర్తీ చేయగలుగుతారు.  సాఫ్ట్ వేర్ రంగం వారికి, కళారంగం వారికి అనుకూల అవకాశములు ఉంటాయి. వివిధ రకములుగా ఖర్చు అయ్యే అవకాశములు ఉన్నాయి. ఎంత ఆదాయం ఉన్నప్పటికీ ఆదాయమునకు మించి ఖర్చు కనబడుతుంది. 

విలాసములు, వ్యసనముల విషయంలో జాగ్రత్త వహించండి. అయితే ఎంత సంపాదించినా కుటుంబానికి ఖర్చు అయిపోతోంది, ఈ ఆర్ధిక ఇబ్బందులు ఎప్పుడు తొలగుతాయి అనే ఆందోళన, వృధా చింతన ఎక్కువ అవుతుంది. అనవసరమైన ఆలోచనలు దూరం పెట్టండి. అభివృద్ధి ఉంటుంది.  ఆరోగ్యం పట్ల,  శ్రద్ద వహించండి. స్నేహితులతో సన్నిహితం మంచిది. 

విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన సమయం. కొత్త కోర్సులు నేర్చుకొనుటకు మంచిది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నములు అనుకూలిస్తాయి. ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ప్రతి విషయాన్ని సూక్షమంగా ఆలోచిస్తారు, ఉద్యోగ వ్యాపార విషయాలలో సానుకలత ఉంటుంది. ధన లాభం వస్తూ లాభం వుంది


వృశ్చికం: ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలత ఉటుంది. ఉద్యోగస్తులకు యధావిధిగా ఉన్నప్పటికీ, ఏవో తెలియని చికాకులు, మానసిక ఆందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి. అధిక శ్రమ పెరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారస్తులకు కూడా అన్నింటా సత్ఫలితములు ఉన్నప్పటికీ చిన్నచిన్న విషయాలు పెద్దవి అయ్యే ప్రమాదములు కూడా ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అర్ధాష్టమశని ప్రభావం వలన, అందునా శని వక్రస్థితిలో సంచారం వలన తెలియకుండానే ఎదో ఒక బాధలు ఎదురవుతాయి. మానసిక ఆందోళనలు, విచారము, అనుకోని విధంగా సమస్యలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఇటువంటి సమయంలో తొందరపాటు నిర్ణయములు తీసుకోవడం మంచిది కాదు. 

ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించండి. దీర్ఘ కాలిక వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించండి. అశ్రద్ధ చేయవద్దు. ఇష్టవస్తు ప్రాప్తి, మనోవాంఛ సిద్ధిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల యందు అనుకూలమైన ఫలితములు ఉంటాయి.  సబ్జెక్టు వచ్చినప్పటికీ పరీక్షలప్పుడు విపరీతమైన మానసిక ఒత్తిడి వలన పరీక్షల యందు దృష్టి తగ్గుతుంది. విద్య మీద ద్రుష్టి పెట్టడం చాల అవసరం ఈ రాసి వారికీ. 

ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశాలు వున్నాయి జాగర్త వహించండి. మీరు ఏది చేసిన కుటుంబం కోసమేనని మీ ఆలోచన అందరికి అర్థం కాదు.  


ధనస్సు: ఉద్యోగస్తులకు సానుకూలత యధావిధిగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధన ప్రాప్తి వుంది. కుటుంబం తో విహార యాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి. సంపాదించడం ఎంత ముఖ్యమో అంతే ఖర్చు కూడా ముఖ్యం. ఖర్చులు వృధా కాకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు కూడా ఆర్ధికంగా లాభములు ఉంటాయి. టెక్నీకల్ రంగములు వారు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ఫలితములు ఉన్నప్పటికి ఆర్ధికంగా మీరు అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు. 

కుటుంబంతో, సంతానంతో సంతోషంగా గడుపుతారు. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మనసు ప్రశాంతముగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరడంతో మీమీద వచ్చే చిన్న చిన్న విషయాలను పట్టించుకోరు. అనవసరమైన శ్రమ ఉంటుంది.  ముందుముందు వెళ్లబోయే ప్రయాణముల గురించి ప్రణాళికలు వేస్తారు. బంధువులతో కలయిక గురించి ఆలోచిస్తారు. కుటుంబంలో జరుగబోయే శుభకార్యములు గురించి కూడా ఆలోచనలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ సంతోష కరంగా వ్యవహరిస్తారు. 

అయితే సంతోషంలో మాట్లాడే మాటల వలన ఇతరుల గురించి విమర్శించే అవకాశములు ఉన్నాయి. వాటి వల్ల  అవతల వాళ్ళతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఎవరితో కూడా శత్రుత్వం కలిగించే మాటలు కానీ, పనులు కానీ చేయకపోవడం మంచిది. ఆలోచనలను, నిర్లక్ష్యం చేయవద్దు . ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం బాగుంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలను పట్టించుకోరు. మానసిక ధైర్యం కలుగుతుంది. 

విద్యార్థిని విద్యార్థులు విద్య పట్ల కాస్త శ్రద్ద వహించండి. వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాలి. మెడిసిన్ చదువుతన్నవారికి మంచి పురోగతి ఉంటుంది.  ఈవారం స్త్రీలకు ఇంట బయట అన్ని విధాలుగా అనుకూలం. ఉద్యోగం లో పురోగతి బాగుంటుంది. మనం బాగుండాలి అందరు బాగుండాలి అనే మీ ధోరణిలో వుంటారు. ఏ పని చేసిన నిదానంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.


మకరం: ఉద్యోగస్తులు, సాఫ్ట్ వేర్ రంగము వారికి, అలాగే టెక్నాలజీ పరంగా కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.  మానసిక ఆందోళనలు, విచారములు ఎన్ని ఉన్నప్పటికీ మీ యొక్క సొంత ఆలోచనలు, తెలివితేటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. శారీరక బలహీనత ఉంటుంది. వృధా ప్రయాణములు, వాటివల్ల ధననష్టం జరిగే అవకాశములు ఉన్నాయి. చిన్న పాటి అవమానములను సైతం లెక్క చేయకుండా మీ పనులు మీరు నిర్వర్తిస్తారు.  

ఎంత కష్టపడినా ఇదే ప్రతిఫలం అని బాధపడే అవకాశములు ఉన్నాయి. ప్రమోషన్స్ కి ఇది అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు.  కొత్తగా ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి  ఫలితములు ఉన్నప్పటికి ఆర్ధికంగా మీరు అనుకున్న జీతం రాకపోవచ్చు. ఆందోళన చెందకండి. అభివృద్ధి నిదానంగా ఉంటుంది.  ఏలినాటి శనితో పాటు వక్రించిన గురుని ప్రభావం వలన కూడా అనుకున్న పనులు ఆలస్యంగా జరగడం వంటివి  ఉంటాయి. భవిష్యత్తు బాగుంటుంది.  కుటుంబ అపారంగా, జీవిత భాగస్వామితో కానీ, కుటుంబంలో కానీ చిన్న పాటి మనస్పర్థలు ఉండే అవకాశములు ఉన్నాయి. మీరు సరైన సమాధానం చెప్పకపోవడం ఒక కారణమవ్వవచ్చు. కుటుంబంతో సంతోషంగా గడపండి.  మీ సమస్యలు వారికి అర్ధం అయ్యేలా చెప్పండి. మీకు కుటుంబం అండదండలు ఉంటాయి. 

ఈవారం స్త్రీలకు  జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశాలు వున్నాయి జాగర్త వహించండి. ఏ పని చేసిన అలోచించి చేయాలి  శత్రు వర్గం పెరిగే అవకాశం వుంది. ప్రతి నిత్యం నవగ్రహ స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన. సంతానం పట్ల జాగర్త వహించాలి. చదువు కంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడతారు. అది అంత మంచిది కాదు. వారి విద్య పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి. 


కుంభం: ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగయం పట్ల జాగర్త వహించండి.  ఉద్యోగ పరంగా ఈవారం బాగుంది అని చెప్పవచ్చు, అధికారులతో మాట్లాడేటప్పుడు జాగర్త వహించండి. కొత్త ప్రాజెక్ట్స్ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సహనం పాటించాలి. వ్యాపార పరంగా అంత అనుకూలంగా వున్నా ఎదో తెలియ ఆందోళన చెందుతారు. ఇంట బయట విరోధం ఎక్కువవుతుంది. మీ అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యాపారంలో విభేదాలొచ్చే అవకాశాలున్నాయి జాగర్త వహించండి. 

మాట పట్టింపులకు పోయి ఇబ్బందులు తెచ్చి పెట్టుకోకండి.  ఇంట్లో వాళ్ల వలన మనో వేదనకు గురి అవుతారు. మనం ఎంత కష్టపడ్డా, ఎంత బాగా చూసుకున్న ఇంత చులకనగా చూస్తున్నారు అన్న భాద ఎక్కువవుతుంది. వృధా ఖర్చు ప్రయాణాలు చేయరాదు. ఆరోగయ పరంగా జాగర్తలు తీసుకోవాలి.  ఇప్పుడు పడే శ్రమకు తగిన ప్రతిఫలం భవిష్యత్తులో తప్పక ఉంటుందని గ్రహించండి. ఇప్పుడు పడే సాధకబాధకాలు రేపు మిమ్మల్ని బలమైన శక్తిగా నిలబెడుతుంది. ఏది ఏమైనప్పటికీ మనవారు ఎవరో, పరాయి వారు ఎవరో తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకున్నంత ఫలితములు ఉండక పోవచ్చు. నిరుత్యాహానికి గురికావద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.


మీనం: ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. కష్టపడినా దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. మీ కింద టీం తో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏ పని చేసిన నిదానంగా సాగుతుంది.  వ్యాపాస్తులకు వ్యహారాలు పట్ల నిర్ణయాలు అలోచించి తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ ఆలస్యం అయ్యే అవకాశములు ఉన్నాయి. శుభకార్యముల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని చేయడం మంచిది.  స్నేహితుల నుండి, కుటుంబం నుండి  సహాయ సహకారములు అందుతాయి. మీ యొక్క తెలివితేటలు, సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. 

ఆర్ధికంగా అంత అభివృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.  వివాహ ప్రయత్నములు అనుకూలిస్తాయి. ప్రయత్నములు ముమ్మరం చేయండి. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. ఎదో  ఒక రకంగా ధనం చేతికి అందడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి.  శత్రువులు కూడా స్నేహితులుగా అయ్యే అవకాశములు ఉన్నాయి. మీ యొక్క మాట ని నిదానంగా ఉంచుకోండి. ఆచీతూచీ మాట్లాడండి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నములు చేయువారికి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. అనుకున్న ఫలితములు ఉంటాయి. ఈవారం స్త్రీలకు  జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశాలు వున్నాయి జాగర్త వహించండి. వ్యాపారంలో ఇబ్బందులు వున్నాయి జాగర్త. ఇంతో అశాంతి నెలకొంటుంది, పిల్లల పట్ల జాగర్త వహించండి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు వున్నాయి. 


                                                Weekly Rasi Phalalu - Sep 24th - Sep 30th 2023 | వార ఫలాలు - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121