దిన ఫలాలు 23-02-2024

దిన ఫలాలు 23-02-2024

మేషం:  కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


వృషభం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ధనలాభం.


మిథునం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


కర్కాటకం: పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పొందుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.


సింహం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఏర్పడిన అవంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులు. సోదరుల నుండి ఆస్తి లాభం.


కన్య: దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ద్వారా ఆనందం కలుగుతుంది. కార్యజయం పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు.


తుల: వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. సోదరుల కలయిక.


వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు, వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. పరపతి పెరుగుతుంది.


ధనస్సు:  బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగప్రాప్తి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.


మకరం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు.


కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.


మీనం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121