దిన ఫలాలు 26-09-2023

మేషం: ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు.


వృషభం: యత్న కార్యసిద్ధి పొందుతారు. సంఘంలోని ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాలు,శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప ధన లాభాలు పొందుతారు.


మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి.


కర్కాటకం: పాత మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి - వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.


సింహం: నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూవివాదాలు తీరీ నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగ, వివాహ యత్నాలు పలిస్తాయి.


కన్య: ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి సలహా పై నూతన కార్యక్రమాలు చేపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు, స్వల్ప ధన లాభాలు పొందుతారు.


తుల: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమ తప్పకపోవచ్చు చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి - వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.


వృశ్చికం: నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వస్తు లాభం పొందుతారు.


ధనస్సు:  ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలలో పాల్గొని విజయం సాధిస్తారు. రాబడి పెరుగుతుంది. దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.


మకరం: ముఖ్యమైన విషయ వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి - వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


కుంభం: రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి, సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.


మీనం: కుటుంబ సభ్యులను చిన్ననాటి స్నేహితులను కలిసి శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. వృత్తి - వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్వల్ప ధన లాభాలు పొందుతారు.


                                                                               

Rasi Phalalu - 2023-09-26 - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121