Sarva Deva Krutha Lakshmi Stotram

సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం

 

సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యముగా పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి.

వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

క్షమంవ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే !
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే !!

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే !
త్వయా వినా జగత్పర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్ !!

 సర్వ సంపత్స్వ రూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ !
 రాసేశ్వర్యది దేవీత్వం త్వత్కలా సర్వయోపిత !!

 కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా !
 స్వర్గేచ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్య లక్షీశ్చ భూతలే !!

 వైకుంఠేచ మహాలక్ష్మీ: దేవదేవీ సరస్వతీ !
 గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః !!

 కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే !
 విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ !!

 పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే ! 
 కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే !!

 కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ !
 రాజాలక్ష్మీ: రాజ గేహే గృహలక్ష్మీర్గ్రుహే గృహే !!

 ఇత్యుక్వ్తా దేవతాస్సర్వా మునయో మనవాస్తథా !!
 రూరూదుర్న మ్రవదనా శుష్క కంఠోష్ఠ తాలుకా !!

 ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవై కృతం శుభమ్ !
 యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ద్రువమ్ !!

 అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్ !
 సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్ !!

 పుత్రా పౌత్ర పతీం శుద్ధాం కులజాం కోమలాం వారామ్ !
 అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ !!

 పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్ !
 భ్రష్టరాజయో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్ !!

 హత బందుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్ !
 కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ద్రువమ్ !!

 సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్ !
 హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్ !!

 ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్
దేవతలందరూ కలిసి లక్ష్మీదేవి పై వ్రాసిన ప్రార్థన ఇది.

లేచిన వెంటనే ఈ శ్లోకాన్ని పఠిస్తే వారు కోరుకున్నవి తప్పకుండా ఫలిస్తాయి.

Products related to this article

Little Krishna Accessories

Little Krishna Accessories

Little Krishna Costume Accessories'The set includes the fallowing Items: Fancy Crown,Flute, Necklace,Peacock feather,Waist belt andWrist bandsAccessories like flute and waistbelts are available i..

$16.00

0 Comments To "Sarva Deva Krutha Lakshmi Stotram"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!