Mantras to Recite for Sri Mahalakshmi Devi Blessings

శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదవాల్సిన మంత్రాలు !


 
లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జపం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది. 

కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది. 

గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పక మంచి ఫలితాలనిస్తుంది. మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం. అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

రాశి

 పేరులో మొదటి అక్షరం

మంత్రం

మేషం 

చూ,చే,చో,లా,లీ,లూ,లె,లో,అ

ఓం ఏం క్లీం సోః

వృషభం 

ఇ,ఉ,ఎ,ఓ,వా,వి,వూ,వె,వో  

ఓం ఏం క్లీం శ్రీః

మిథునం

కా,కీ,కూ,ఘ,చ,కె,కోహా

ఓం క్లీం ఏం సోః

కర్కాటకం

హీ,హో,హె,డా,డీ,డూ,డె,డో

ఓం ఏం క్లీం శ్రీః

సింహం

మా,మీ, మూ,మె,మో,టా,టి,టూ,టె

ఓం హ్రీం ఏం సోః

కన్య

టో,పా,పీ,పూ,ప,ణ,ఠ,పె,పో

ఓం శ్రీం ఏం సోః

తుల

రా,రీ,రూ,రె,రో,తా,తీ,తూ,తె 

ఓం హ్రీం క్లీం శ్రీం:

వృశ్చికం

తో,నా,నీ,నూ,నె,నో,యా,యీ,యూ

ఓం ఏం క్లీం సోః

ధనుస్సు 

యె,యో,భా,భీ,భూ,ధా,ఫా,ఢా,భె 

ఓం హ్రీం క్లీం సోః

మకరం 

భో,జా,జీ,ఖీ,ఖూ,ఖె,ఖో,గా,గీ 

ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సోః

కుంభం

గూ,గె,గో,సా,సీ,సూ,సె,సో,దా 

ఓం హ్రీం ఏం క్లీం శ్రీం

మీనం

దీ,దూ,ధ,ఝ,దె,దో,చా,చీ 

ఓం హ్రీం క్లీం సోః

ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు. అందుచేత మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి. ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.

Products related to this article

Designed  Bowl (Brass)

Designed Bowl (Brass)

Designed  Bowl (Brass)This bowl is made of bross which is used for decoartion prupose.The length of the bowl is : 15 Inchs Width of the Bowl : 7 Inchs Height of the Bowl : 9 Inchs ..

$8.46

0 Comments To "Mantras to Recite for Sri Mahalakshmi Devi Blessings"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!