Rushi Panchami

ఋషి పంచమి

భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమి అని వ్యవహరిస్తారు. ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చినవారు అత్రిమహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపించినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపః ఫలాన్ని అందించిన మహారుషి గౌతముడు. రాముడి గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్ఠుడు. విష్ణువు అవతారమైన పరశురాముడి కన్నతండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాలలో ఒకటి అయిన వామనుడి తండ్రి కశ్యప మహర్షి. ఋషి పంచమి రోజున రామాయణం చదివితే ఈ మహర్షులు అందరినీ తలచుకున్నట్లే అని వేదపండితులు చెబుతున్నారు.

ఋషి పంచమి - వ్రత విధానం

ఋషి పంచమి రోజున ఇంట్లో ఈశాన్య మూలలోని స్థలాన్ని శుద్ధి చేసుకుని, అలికి, బియ్యపుపిండితో ముగ్గులు పెట్టి దేవుడి స్థాపనకు ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టుకుని బియ్యపుపిండితో ముగ్గులు వేసుకోవాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్ని వేస్తారు.

పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చుని, ఏ దైవాన్ని పూజించాలని అనుకుంటున్నారో ఆ దైవ పటాన్ని కానీ, ప్రతిమను కానీ పీటపై పటిష్తించుకోవాలి. పూజ చేసే ముందు పసుపుతో వినాయకుడిని తయారుచేసి దానికి కుంకుమబొట్టు పెట్టి తరువాత ఒక పళ్ళెంలో కానీ కొత్త తువ్వాలు మీద కానీ బియ్యంవేసి దానిపై ఒక తమలపాకు నుంచి దానిపై పసుపు గణపతిని పెట్టి దీపాలు వెలిగించి దీప దర్శనం చేయించి, అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలి.

దీపారాధన విధానం : దీపారాధన చేయడానికి ప్రమిద వెండిది కానీ, ఇత్తడిది కానీ, మట్టిది కానీ వాడవచ్చు. ప్రమిదలో మూడు అడ్డ వత్తులు, ఒక కుంభ వత్తి (మధ్యలో) వేసి నూనెతో తడపాలి. ఇప్పుడు ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఎకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఎకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో ప్రమిదలోని ఒక అడ్డ వత్తి, ఒక కుంభ వత్తి వెలిగించాలి. తరువాత చేయి కద్దుకుని నూనె కుంది నిన్దా వేసి తరుఆత ఆ ప్రమిదకి మూడుచోట్ల కుంకుమతో అలంకరించాలి. తరువాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపంగా నువ్వులనూనె కానీ, కొబ్బరినూనె కానీ, ఆవు నెయ్యి కానీ వాడవచ్చు. ఈ విధంగా దీపం వెలిగించి ఘనతను వాయిస్తూ నమస్కరించి …

ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్

కుర్వాద్ఘంటార వంతత్ర దేవతాహ్వాన లాంఛ నమ్

అంటూ ఆచమనం చేసే పంచాపాత్రలోని నీళ్ళు దేవుడి పూజకు విడిగా ఒక గ్లాసు కానీ, చెంబు కానీ తీసుకుని దాంట్లో శుద్ధమైన నీళ్ళను పోసి ఆ చేమ్బుకి కలసహరాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుడి పూజకు ఉపయోగించాలి. పూజకి తోరాలు, తెల్లని దారానికి పసుపు రాసి తొమ్మిది వరసలు వేసి తొమ్మిది చోట్ల పువ్వులతో కట్టి, ఆ తోరాలను దేవుడికి పొజ చేసి పూజ చేసిన వారందరూ తమ కుడిచేతికి కట్టుకోవాలి. ప్రత్యేక నివేదన అంటే పిండివంటలు తరువాత పూజ చేసేవారు కేశవనామాలు స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఏ నామాలు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి. అవి …

ఓం కేశవాయ స్వాహా అని చెప్పుకుని చేతిలో నీళ్ళు పోసుకుని త్రాగాలి. ఓం నారాయణాయ స్వాహా అనుకుని ఒకసారి, ఓం మాధవాయ స్వాహా అని ఒకసారి నీళ్ళు త్రాగిన తరువాత ఓం గోవిందాయ నమః అని చేతులు కడుక్కోవాలి. ఓం విష్ణవే నమః అని అంటూ నీళ్ళు త్రాగి, మధ్యవేలు, బొటన వేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి. ఓం మధుసూధనాయ నమః అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి. ఓం త్రివిక్రమాయ్ నమః అని కింద పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి. ఓం హృషీకేశాయ నమః ఎడమచేతితో నీళ్ళు చల్లాలి. ఓం పద్మనాభాయ నమః అని పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి. ఓం దామోదరాయ నమః అని వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవాలి. ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అని కళ్ళు తాకాలి. ఓం పురుషోత్తమాయ నామం, ఓం అధోక్షజాయ నమః అన్న్తూ రెండు చెవులు తాకాలి. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః అని బొడ్డును తాకాలి. ఓం జనార్థనాయ నమః అని చేతివ్రేళ్ళతో వక్షస్థలం, హృదయ భాగాన్ని త్తాకాలి. ఓం ఉపేంద్రాయ నమః చేతికొనతో శిరస్సును తాకాలి. ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః అంటూ కుడి మూపురాన్ని ఎడమచేతితో, ఎడమ మూపురాన్ని కుడిచేతితో తాకాలి.

ఆచమనం వెంటనే సంకల్పం చెప్పుకోవాలి. ఆచమనం అయిన తరువాత, కొంచెం నీళ్ళు చేతిలో పోసుకుని నేలపై చిలకరిస్తూ …

ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః

యేతే షామవిరో ధేన బ్రహ్మకర్మ సమారభే !!

అని పఠించాలి.

ప్రాణాయామ్యం :

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం - ఓం తత్ సవితుర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహీధ యోయోనః ప్రచోదయాత్ - ఓం అపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్చు వస్సువరోం .. అని సంకల్పం చెప్పుకోవాలి.

సంకల్పం :

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్ధశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభ శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ (ఇక్కడ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా అని కూడా చెప్పుకోవచ్చు) ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవ స్వతమంవంతరే కలియుగ ప్రథమపాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలం ప్రధాన క్షేత్రం కాబట్టి మనం శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), కృష్ణా గోదార్యోః మధ్యప్రదేశే (మనం ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకోవాలి) , శోభన గృహే (అద్దె ఇళ్ళు అయినట్లయితే వసతి హ్రుహే అనీ, స్వంత ఇల్లయినట్లయితే స్వగృహే అనీ చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన సంవత్సర (పూజ చేస్తున్న తెలుగు సంవత్సరం పేరు చెప్పాలి), ఆయనే (సంవత్సరంలో రెండు ఆయనాలు - ఉత్తరాయణం, దక్షిణాయణం. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జులై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణం, జులై 15 కర్కాటక సంక్రమణం నుండి జనవరి 14పెద్ద పండగ మకర సంక్రమణం వరకు దక్షిణాయణం, పూజ చేస్తున్నప్పుడు ఏ ఆయనం జరుగున్నదో దాన్ని చెప్పుకోవాలి) ఋతుః (వసంత, గ్రీష్మ మొదలైన ఋతువులలో పూజ చేస్తున్న సమయంలో జరుగుతున్నా మాసం పేరు) , పక్షే (నెలకు రెండు పక్షాలు పౌర్ణమికి ముందు శుక్లపక్షం, అమావాస్యకి ముందు కృష్ణపక్షం వీటిలో పూజ జరుగుతున్న సమయం ఉన్న పక్షం పేరు). తిథౌ (ఆరోజు తిథి), వాసరే (ఆ రోజు ఏ వారమో ఆ వారం పేరు చెప్పుకుని)శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే ఏవం గుణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీరామా ముద్ధశ్య శ్రీరామ ప్రీత్యర్థం పురుషులు అయినట్లయితే శ్రీమాన్ … గోత్రస్య … నామధేయ, శ్రీమాత్యః, గోత్రస్య, నామధేయస్య అని, స్త్రీలు అయినట్లయితే శ్రీమతి, గోత్రవతి, నామదేయవతి, శ్రీ మత్యాః, గోత్ర వత్యాః, నామధేయవత్యాః అని (పూజ చేసేవారి గోత్రం, పేరు చెప్పి) నామధేయస్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులు) మమ సహా కుటుంబస్య, క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛ ఫల సిద్ద్యర్థం, శ్రీరామ ముద్ధశ్య శ్రీరామ ప్రీత్యర్థం (ఏ దేవుడిని పూజిస్తున్నామో ఆ దేవుడి పేరు చెప్పుకుని) సంభావద్భి రుపచారైః సంభవతానియమేన సంభవతా ప్రకారేణ యావచక్తి (నాకు తోచిన రీతిలో, నాకు తోచిన విధంగా, భక్తిశ్రద్ధలతో సమర్పించుకుంటున్న పూజ) ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదంగ కలశ పూజాం కరిష్యే.

కలశ పూజ వివరణ :

వెండి, రాగి లేదా కంచు చెంబులు రెండింటిలో శుభ్రమైన నీళ్ళను తీసుకుని ఒకదాంట్లో ఉద్దరిణిని, రెండవ దాంట్లో అక్షింతలు, తమలపాకు, పువ్వు ఉంచుకోవాలి. రెండవ చేమ్బుకి బయట మూడు వైపులా గంధాన్ని పూసి కుంకుమ అద్దుకోవాలి. ఇలా చేస్తున్న సమయంలో గ్లాసును గుండ్రంగా తిప్పుతూ గంధం, కుంకుమ పూయకూడదు. గంధాన్ని ఉంగరపు వేలితో పూయాలి. కుంకుమ, అక్షతలను మధ్య ఉంగరపు వేళ్ళను కలిపి సమర్పిచాలి. పూజచేసేవారు (ఒక్కరే అయితే, దంపతులు అయితే ఇద్దరూ) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ఇలా అనుకోవాలి. ఈ విధంగా కలశాన్ని చేసుకుని పూజ చేస్తున్నప్పుడు మొదటగా ఈ శ్లోకాన్ని చదవాలి.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్ర్రుతః

మూలే తత్ర బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతాః

ఋగ్వేదో ధయజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ,

నర్మదా, సింధు కావేరౌయో జలేస్మిన్ సంనిధంకురు

ఇక్కడ ఇలా శ్లోకాన్ని ముగిసిన తరువాత ఆయాతు శ్రీరామ (ఏ దేవుడి పూజ అయితే చేస్తున్నామో ఆ దేవుడి పేరు చెప్పాలి) పూజార్థం మమ దురితక్షయకారకాః కలశో దాకెన ఓం దేవం సంప్రోక్ష్య (కలశంలోని ఉదకాన్ని దేవుడిపై చల్లాలి) కలశంలోని నీటిపై మంత్రం చదువుతూ పువ్వుతో కానీ, తమలపాకుతో కానీ చల్లాలి.

మార్జనం :

ఓం అపవితః పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా

యస్స్మరేత్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్ముచిః

అని తరువాత కొన్ని అక్షతలు, పసుపు, గణపతిపై వేసి ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయాలి. ప్రాణ ప్రతిష్ఠ అంటే శ్రీ మహా గణాదిపతయే నమః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సుమునూర్తోస్తు తథాస్తు. తరువాత ఇలా చదువుతూ గణపతికి నమస్కరించాలి.

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే

సుకుఖశ్చైక దంతశ్చ కపిలో గాజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః

దూమకేతుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంభః స్కంధ పూర్వజ

షోడ శైతాని నామానియః పతిచ్చ్రుణు యాదపి

విద్యారంభే వివాహిచ ప్రవేశే నిర్గమే తదా

సంగ్రామ సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే

తరువాత షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచారాలు అంటే ధ్యానం, ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవ్రేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణాలు మొదలైనవి.

ధ్యానం :

ఓం శ్రీరామచందాయ నమః ధ్యాయామి

ధ్యానం సమర్పయామి అని శ్రీరాముడిని మనస్సులో ధ్యానించి నమస్కారం చేయాలి.

ఆవాహనం :

ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి

ఆవాహనార్థం అక్షతాం సమర్పయామి

అంటే మనస్ఫూర్తిగా దేవుడిని మన ఇంట్లోకి ఆహ్వానిచడం, అలా మనస్సులో అక్షతలు దేవుడిపై వేయాలి.

ఆసనం :

ఓం శ్రీరామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సిమ్హాసనార్థం అక్షతాం సమర్పయామి, దేవుడు కూర్చోవడానికి మంచి బంగారుపీట వేసినట్లు మనస్సులో అనుకుంటూ అక్షింతలు వేయాలి.

అర్ఘ్యం :

ఓం శ్రీరామ నమః హస్తాః అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనస్సులో అనుకుంటూ, ఉద్దరిణితో నీళ్ళు వేరే గిన్నెలో వదలాలి.
పాద్యం :

ఓం శ్రీరామ నమః పాదౌః పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనస్సులో అనుకుంటూ పువ్వుతో పంచాపాత్రలోని నీళ్ళు అదే గిన్నెలో ఉద్దరిణితో వదలాలి.

ఆచమనీయం :

ఓం శ్రీరామ నమః ఆచమనీయం సమర్పయామి అని అంటూ దేవుడికి ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనస్సులో అనుకుంటూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణితో మళ్ళీ ఒకసారి నీళ్ళు వదలాలి.

మధుపర్కం :

ఓం శ్రీరామ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయడానికి వస్త్రం ఇస్తున్నామని మనస్సులో అనుకుంటూ ఈ మధుపర్కాన్ని ఆయన ప్రతిమకి అద్దాలి. (పత్తిని పెద్ద బొట్టుబిళ్ళ సైజులో గుండ్రంగా చేసి నీటితో తడిపి ఆ తరువాత రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకున్న దాన్ని మధుపర్కం అని అంటారు)

పంచామృత స్నానం :

ఓం శ్రీరామ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానానికి పంచామృతంతో ఉన్న నీళ్ళు ఇచ్చినట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపినా పంచామృతాన్ని స్వామిపై ఉద్దరిణితో చల్లాలి.

శుద్దోదక స్నానం :

ఓం శ్రీరామ నమః శుద్దోదక స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పూవుతో దేవుడిపై చల్లాలి.

వస్త్రయుగ్మం :

ఓం శ్రీరామ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మం అంటే రెండు) అంటూ వస్త్రాన్ని (పత్తిని పెద్ద బొట్టుబిళ్ళ సైజులో గుండ్రంగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినట్లు అయితే అది వస్త్రం అవుతుంది. ఇటువంటివి రెండు చేసుకోవాలి) స్వామివారి ప్రతిమకు లేదా ఫోటోకు అద్దాలి.

యజ్ఞోపవీతం :

ఓం శ్రీరామనమః ఉపవీతం సమర్పయామి అంటే జంద్యం ఇవ్వాలి. ఇది కూడా పత్తితో చేయవచ్చు. పత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటనవేలు మధ్య వేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి కుంకుమ అద్దాలి, దీన్ని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించాలి.

గంధం :

ఓం శ్రీరామ నమః గంధాన్ సమర్పయామి. ముందుగా తీసిపెట్టుకున్న గంధాన్ని కుడిచేతి ఉంగరం వేలితో స్వామివారిపై చల్లాలి.

ఆభరణం :

స్వభావ సుందరాన్గాయనానా శక్త్యా శ్రయాయతే, భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత

ఓం శ్రీరామ నమః ఆభరణాన్ సమర్పయామి అని స్వామికి మనం చేయించిన ఆభరణాలు అలంకరించాలి లేకప్యినట్లయితే అక్షతాన్ సమర్పయామి అని అక్షింతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించాలి. తరువాత అథాంగ పూజ చేయాలి. ఈ నామాలను చదువుతూ పువ్వులతో కానీ, పసుపుకుంకుమతో కానీ స్వామిని పూజించాలి. తరువాత అష్టోత్తర శతనామావళి నామాలను చదువుతూ పువ్వులతో కానీ, పసుపుకుంకుమతో కానీ స్వామిని పూజించాలి.

ధూపం :

ఓం శ్రీరామ నమః ధూప మాఘ్రపయామి. ధూపం సమర్పయామి అంటూ ఎడమచేతితో గంట వాయిస్తూ కుడిచేత్తో అగరవత్తిని తిప్పుతూ పోగను స్వామికి చూపించాలి.

దీపం :

ఓం శ్రీరామ నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధన వున్న అదనపు వత్తులతో ఒక దాన్ని తీసుకుని హారతి వెలిగించే దాన్లో వేసి వెలిగించి గంట మోగిస్తూ ఆ దీపం స్వామికి చూపిస్తూ పై శ్లోకాన్ని చదవాలి.

నైవేద్యం :

ఓం శ్రీరామ నమః నైవేద్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క, పండ్లు, కొబ్బరికాయ మొదలైనవి ఒక పళ్ళెంలో తీసుకుని స్వామి దగ్గర పెట్టి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమచేతితో గంట వాయిస్తూ ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి. (ఋతంత్వా సత్యేట పరిషించామి అని రాత్రి చెప్పాలి) అమృతమస్తు అమృతోపస్త రణమసి, ఓం ప్రాణాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు సార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణితో) స్వామికి నివేదన చేయాలి. తరువాత ఓం శ్రీరామ నమః నైవేద్యానంతరం హస్తౌ ప్రక్షాళన యామి అని ఉద్దరిణితో పంచాపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర) లో వదలాలి. పాదౌ ప్రక్షాళయమి అని మళ్ళీ ఒకసారి నీళ్ళు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణితో వదలాలి. పునః శుద్ధాచమనీయం సమర్పయామి అని ఇంకొకసారి నీళ్ళు వదలాలి.

తాంబూలం :

ఓం శ్రీరామ నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలాన్ని (మూడు తమలపాకులు, రెండు పోకచెక్కలు, అరటిపండి) స్వామి దగ్గర పెట్టాలి. తాంబూలం వేసుకున్నా నోరు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నామని అనుకుంటూ తాంబూలం చరవాణానంతరం శుద్ధ ఆచమనీయంన్ సమర్పయామి అంటూ ఉద్దరిణితో నీళ్ళు అర్ఘ్యపాత్రలో వదలాలి. తరువాత కర్పూరం వెలిగించి …

నీరాజనం :

ఓం శ్రీరామ నమః కర్పూర నీరాజనం సమర్పయామ్ని అని కర్పూర బిళ్ళలు హారతి పళ్ళెంలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుసార్లు తిప్పుతూ, చిన్నగా ఘంట వాయించాలి. తరువాత మళ్ళీ పువ్వుతో హారతి కుంది చివర వదులుతూ కర్పూర నీరజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించిన తరువాత ఇంట్లోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి, అక్షతలు, పువ్వులుం చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుని

మంత్రపుష్పం :

ఓం శ్రీరామ నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకుని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామి దగ్గర పెట్టాలి. ఈ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణాలు చేయాలి.

ప్రదక్షిణం :

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ, నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్న నాశన …

ప్రమథగణ దేవేశ ప్రసిద్దే గణనాయక, [రాదక్షినం కరోమిత్వా మీశ నమోస్తుతే

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదేపదే

ఓం శ్రీరామ నమః ఆత్మ ప్రదక్షిణ చేసి (అంటే తమచుట్టూ తిరిగి) సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆనించి, ఆడవారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి) స్వామిపై చేతిలో పెట్టుకున్న అక్షితలు, పువ్వులు వేసి మళ్ళీ తమ స్థానంలో నమస్కరిస్తూ …

పునఃపూజ :

ఓం రామ నమః పునః పూజంచ కరిష్యే అని చెప్పుకుని, పంచాపాత్రలోని నీళ్ళను చేతితో తాకి, అక్షతలు, పువ్వులు స్వామిపై వేస్తూ …

విశేశోపచారాలు :

ఛత్రం అచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార, భక్తోపచార పూజాంసమర్పయామి అనుకుని, నమస్కరిస్తూ …

పూజాఫల సమర్పణమ్ :

యస్యస్క్రుతాచ నమావుక్త్యా తపం పూజా క్రియాది షు యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే

అనయాధ్యానావాహనాది శోధశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. ఎత్పతల శ్రీరామర్పణమస్తు అంటూ అక్షతలు నీళ్ళతో పాటు అరవేణంలో వదలాలి. తరువాత శ్రేఎరామ ప్రసాదం శిరసాగ్రుహ్నామి అనుకుని స్వామి దగ్గర అక్షతలు తీసుకుని తమ తలలపై వేసుకోవాలి. ఆ తరువాతపడుపు గణపతి ఉన్న పళ్లాన్ని ఒకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద పెట్టి పెళ్లెంలో ఉన్న పడుపు గణపతిని తీసి దేవుడి పీఠంపై ఉంచాలి, దీనిని ఉద్వాసన చెప్పడం అంటారు. ఓం శ్రీ రామ నమః యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం పునరాగమనాయచ అని ఉద్వాసన పలకాలి. పూజా విధానం సంపూర్ణం,

తీర్థ ప్రాశనమ్ :

అకాల మృత్యువరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామ పాదోదకం పావనం శుభం అని తీర్థం చేతిలో వెసుకుఇ మూడుసార్లు నోట్లో వేసుకోవాలి.

వ్రత కథా ప్రారంభం :

స్వర్గలోకానికి గురువు అయిన, సర్వేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడిని చూసి ధర్మరాజు 'ఓ దేవదేవా! అనేక వ్రతాలను గురించి విన్నా, వ్రతాలలో ఉత్తమమమైనది అన్ని సోదాలను పోగొట్టేది అయిన ఒక వ్రతం వినాలని ఉంది అని చెప్పగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు "ఓ ధర్మరాజా! చెపుతాను విను. దేన్నీ చేయడం వల్ల ప్రజలు నరకాన్ని చూడరో, పాపాలను పోగొట్టేది ఆయన 'ఋషి పంచమి' అనే వ్రతం ఒకటి ఉన్నది. దాన్ని గురించి పురాణకథ ఒకటి వుంది.

పూర్వకాలంలో విదర్భ దేశంలో ఉదంకుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుషీల్. ఈమె పతివ్రతా వీరికి సుభీషణుడు అనే కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇతని కొడుకుజ్ వేదవేదాంగాలను చదివాడు. కూతురిని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తరువాత ఆమె విధివశం వల్ల వైధవ్యాన్ని పొందింది. తాను పవిత్రంగా ఉంటూ, తన తండ్రి ఇంట్లో కాలం గడుపుతూ ఉండేది. తండ్రి అయిన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధపడుతూ కొడుకు ఇంటి నుండి భార్యను, కూతురిని తీసుకుని అడవులకు వెళ్ళి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నాడు. అలా ఉండగా కూతురు కూడా తండ్రికి పరుచార్యాలు చేస్తుండగా ఒకరోజు అర్థరాత్రి వేళ, అలసిపోయి నిద్రిస్తుండగా ఆమె దేహం అంతా పురుగులు పట్టాయి. ఇలా శరీరమంతా పురుగులతో నిండుకుని ఉన్న ఆమెను చూసి శిష్యులు ఆమె తల్లికి చెప్పారు. అది విని తల్లి చాధపడి, ఆమె శరీరానికి ఉన్న పురుగులను దులిపి, ఆమెను తీసుకుని తన భర్తయిన ఉదంకుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించి చెప్పి, ఇందుకు కారణం తెలపాలని కోరుకుంది. ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి ఆమె పూర్వజన్మ వృత్తాతం అంతా గ్రహించి ఇలా చెప్పాడు.

ఓ ప్రాణేశ్వరీ! ఆమె ఇంతకుముందు తన ఏడవ జన్మలో బ్రాహ్మణ స్త్రీ అయి ఉండి కూడా రజస్వల అయి దూరంగా ఉండకుండా ఇంటిపనులు అన్నీ చేస్తూ వంట సామాగ్రిని తాగిన దోషం వలన ఆమె శరీరమంతా పురుగులు వ్యాపించాయి, కాబట్టి స్త్రీ రాజోయుక్తరాలు అయినట్లయితే పాపం కలది అవుతుంది. అది ఎలా అంటే మొదటి రోజు చూడాలి, రెండవరోజు బ్రహ్మఘాతి (బ్రహ్మను చంపిన పాపం కలదిగా) మూడవరోజు రజస్వల అయి నాలుగవ రోజున శుద్ధి అవుతుంది. ఇలా ఉండగా ఈమె పూర్వం చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతాన్ని అవమానించింది. కాని, ఆ వ్రతం చేయడం చూసి ఉండడం వలన నిర్మలమైన బ్రాహ్మణకులంలో పుట్టడం జరిగింది. ఆ వ్రతాన్ని దూశించిడం వలన శరీరమంతా పురుగుల పట్టాయి అని ఉదంకుడు తన కూతురు య్హోక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పగా భార్య సుశీల ఏ వ్రతం యొక్క మహిమతో ఉత్తమ కులంలో పుట్టడం ఇంకా శరీరమంతా పురుగులు వ్యాపించడం జరిగిందో ఆ మహిమ గల ఆశ్చర్యకరమైన వ్రతాన్ని గురించి నాకు తెలపాలని కోరింది. అందుకు ఉదంకుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు.

ఏ వ్రతం చేసినంతనే స్త్రీలకు సకల సౌభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయో, సర్వపాపాలు తొలుగుతాయో అంతే కాకుండా ఆపడలేని సంపదలు వర్థిల్లుతాయో అటువంటి వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది. శ్రీక్రిషుడి మాటను విని ధర్మరాజు ఇలా అంటున్నాడు ' ఓ కృష్ణా! ఈ వ్రతం యొక్క మహిమను వివరించు' అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా తెలిపాడు 'ఓ రాజేంద్రా! ఏ వ్రతాన్ని చేసినట్లయితే సర్వపాపాల నుండి విముక్తి పొందుతారో ఆ వ్రతాన్ని గురించి నీకు తెలుపుతాను' అన్నాడు. ‘ఋషి పంచమి' అనే వ్రతం ఉంది. ఒక స్త్రీ 'రజస్వల' అయినప్పుడు తెలిసీ, తెలియక అయినా వంట చేసే పాత్రలను తాకినట్లయితే అది పాపమే అవుతుంది. బ్రాహ్మణులు మొదలైన నాలుగు జాతుల్లోనూ స్త్రీలు రజస్వల సమయంలో ఉన్నప్పుడు దూరంగా ఉండడం శ్రేష్ఠం. అంటే కారణం ఉన్నది. అది ఏమిటంటే ఇంద్రుడు ముందు వృత్తాసురుడిన

0 Comments To "Rushi Panchami"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!