Rules For Sri Sai Navaguru Vara Vratham

శ్రీ సాయి నవగురువార వ్రతము

సాయి వ్రత పూజకు కావలసిన సామాగ్రి :

  1. శ్రీ సాయినాథుని పటం లేదా ప్రతిమ
  2. పసుపు
  3. కుంకుమ
  4. విభూతి
  5. తమలపాకులు
  6. పోకచెక్కలు
  7. అగరవత్తులు
  8. హారతి కర్పూరం
  9. పసుపుపచ్చని పువ్వులు
  10. పసుపుపచ్చ పూల దండ
  11. కొబ్బరికాయ
  12. అరటిపళ్ళు - 24
  13. అక్షితలు
  14. పసుపురంగు వస్త్రం
  15. పంచామృతం (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార)
  16. పసుపురంగు కలశవస్త్రం
  17. తొమ్మిది నవగురు శ్రీ సాయివ్రత పుస్తకాలు
  18. శ్రీ షిరిడిసాయి ద్వారకామాయి చిత్రం (ఫోటో)
  19. దీపారాధనకు నూనె లేదా నెయ్యి, కుందులు, ఒత్తులు, అగ్గిపెట్టె, పంచహారతి స్టాండ్
  20. ఆచమనానికి : చెంబు, గ్లాసు, ఉద్దరిణ, మూడు పళ్ళాలు, కొబ్బరికాయలు కొట్టడానికి రాయి
  21. నైవేద్యానికి ప్రసాదము

వ్రత నియమాలు :

*          శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి

*          మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆచరిస్తున్న వ్రతము చాలా ప్రభావంతమైనది. తొమ్మిది గురువారాలు విధిగా ఆచరిస్తే కోరిన కోరిక సఫలం అవుతుంది.

*          ఏ గురువారమైనా నవగురువార వ్రతాన్ని ప్రారంభించవచ్చు.

*          ఇంట్లో ఈశాన్యంలో ఒక ఆసనంపై పసుపురంగు వత్రాన్ని వేసి దానిపై ద్వారకామాయి ఫోటో పెట్టి శుభ్రమైన వస్త్రంతో ఫోటో తుడిచి, చందన కుంకుమతో అలంకరించి పసుపురంగు పువ్వులు సమర్పించాలి. రెండు వత్తులతో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి, శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని ప్రారంభించాలి.

*          శ్రీసాయిబాబాను భక్తిశ్రద్ధలతో స్మరించి పాలకోవాను నైవేద్యంగా సమర్పించాలి. పాలు, పళ్ళు మాత్రమే  స్వీకరించాలి. వ్రతం పూర్తి కాగానే భోజనం చేయాలి. రాత్రికి తినకూడదు.

*          9 గురువారములు వీలయినంతవరకు సాయంత్రం శ్రీసాయిబాబా మందిరాన్ని దర్శించాలి. ధునిలో పీచు ఉన్న కొబ్బరికాయ సమర్పించాలి.

*          నవగురువార వ్రతాన్ని మధ్యలో ఏదైనా ఊరికి వెళ్ళవలసి వస్తే ఆ వారం తరువాత కొనసాగించాలి. అలాగే స్త్రీలకు ఇబ్బంది వస్తే ఆ గురువారం లెక్కలోకి తీసుకోకుండా మళ్ళీ వచ్చే వరం వ్రతాన్ని కొనసాగించవచ్చు.

*          ఉద్యాపన రోజు కనీసం 9 మంది పేదలకు అన్నదానం చేయాలి. నవగురువార వ్రతం పుస్తకాలు, పళ్ళు, తాంబూలాలతో కానుకగా తోమ్మిదిమందికి పంచిపెట్టాలి.

*          ఉద్యాపన రోజున సాయంత్రం ఖచ్చితంగా శ్రీసాయి మందిరాన్ని దర్శించాలి.

Click Here To View శ్రీసాయి నవగురువార వ్రతం ఎందుకు చేయాలి ?
Click Here To View శ్రీ సాయి పూజా విధానం

0 Comments To "Rules For Sri Sai Navaguru Vara Vratham "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!