What is the importance of 'Pradosha' period?

'ప్రదోషకాల' ప్రాధాన్యత ఏమిటి?

 

వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్

వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !

వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్

వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!

ప్రదోష కాలం ఎంతో పవిత్రమైన కాలంగా హైందవ పురాణంలో తెలుపబడింది. ప్రదోషకాలం నెలకి రెండుసార్లు వస్తుంది ఆ సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే శివానుగ్రహానికి పాత్రులు అవుతారని వేదపండితులు తెలియజేస్తున్నారు. శుక్లపక్షం (అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు మరియు కృష్ణపక్షంలో (పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు, సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు 'ప్రదోషోరజనీముఖమ్' రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే పాపా నిర్మూలన అని అర్థం.

ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేది ప్రదోషము అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే, అప్పుడు ప్రదోషం అంటారు. అందుకే ప్రతోరోజూ సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే, అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది. త్రయోదశి రోజున కలిగే ప్రదోషాన్ని 'మహా ప్రదోషం' అని అంటారు. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎడమ భాగంలో పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా 'అర్థనారీశ్వరుడిగా' దర్శనం ఇచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసేదే ఈ శ్లోకం ...

శ్లో        సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్ !

          వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే !!

• త్రయోదశి  రోజున సాయంతం 4:30 నుండి 6:00 గంటలవరకు ప్రదోషకాలం ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని పూజించినట్లయితే                     ఎటువంటి పాపాలు అయినా దహించుకు పోతాయి.

• ప్రదోషకాలంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవుతారు.

• ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవునేయ్యితో అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది.

• మంచి గంధంతో అభిషేకం చేసినట్లయితే శ్రీమహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

వీటిని పాటించలేని వారు ప్రదోషకాలంలో పంచాక్షరీ మంత్రం అయిన 'ఓం నమః శివాయ' ను జపించినంత మాత్రాన శుభఫలితాలు పొందుతారు.

త్రయోదశి ఆదివారం రోజు వస్తే రవి ప్రదోషం అనీ, త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం అనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం అనీ, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం అనీ, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం అనీ, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం అనీ, త్రయోదశి శనివారం వస్తే శని త్రయోదశి అనీ, శని ప్రదోషం అని పిలుస్తారు. అన్ని త్రయోదశులలో కూడా శివపూజ తప్పనిసరి. ప్రదోషకాలం రోజూ వస్తున్నా, త్రయోదశి రోజున వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివలింగానికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. శుక్లపక్ష సోమవారం రోజున లేదా బహుళపక్ష శనివారం రోజున త్రయోదశి కలిసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరింత విశేషంగా ఉంటుంది. శివలింగానికి జరిగే అభిషేకాలతో పాటు నందీశ్వరుడికి జరిగే అభిషేకాన్ని తిలకించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శనివారం రోజున ప్రదోష కాలంలో శివుడిని ఆరాధిస్తే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చు. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కాబట్టి శని ప్రదోష సమయంలో శివారాధన చేయడం అత్యంత శ్రేష్ఠం.

ప్రదోషకాలం సోమవారం రోజున వచ్చినట్లయితే (త్రయోదశి - సోమవారం) అది అత్యంత మహత్యం గల సమయం. అలాగే శనివారం రోజున వచ్చే త్రయోదశి - ప్రదోషకాలం కూడా ఎంతో  శక్తివంతమైనదిగా పేర్కొనబడింది. శనివారం తటస్థించే ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని పూజించినా, ధ్యానించినా శనికి సంబంధించిన సకల దోషాలు తొలగిపోతాయి. 

 

శివప్రదోష స్తోత్రం:

కైలాస శైల భావనేత్రి జగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాటు మభివాంఛిత శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేన భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్ స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడాపతీమ్

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్పర సాంగణాశ్చ

యేన్యేత్రిలోక నిలయస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః   

Products related to this article

Lava Bracelet

Lava Bracelet

Lava Braceletit is used for calming the emotions. Note : For this bracelet pour 2 drops of essential oil on this bracelet leave it for overnight and then use it...

$14.60

Ammavari Face (Kundan Work)

Ammavari Face (Kundan Work)

Ammavari Face (Kundan Work)DescriptionNo of item : 1 Lakshmi MaskHeight : 18.5 Cms Width : 9.2 CmsBeautiful stone studded and hand painted Goddess Lakshmi Devi.Beautifully decorate..

$8.00

Handi craft Decorative Brass  Square Shaped Bowl with Spoon (4 Inch Diameter)

Handi craft Decorative Brass Square Shaped Bowl with Spoon (4 Inch Diameter)

Handi craft Decorative Brass  Square Shaped Bowl with Spoon (4 Inch Diameter)·         Product Dimension : Bowl 4" Diameter ·    &n..

$10.00

0 Comments To "What is the importance of 'Pradosha' period?"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!