Article Search

Rudra and Shiva are the most important names of Shiva
శివనామాల్లో ముఖ్యమైనవి ‘రుద్ర, శివ’ నామాలురుద్ర’ అంటే రోదనం పోగొట్టేవాడు. ‘శివ’ అంటే మంగళకరమైనవాడు.జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలిగించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవత్సలుడు. ‘మహదేవ’ అని ముమ్మారు భగవన్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు..., అంతేకాదు,మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కరతలే ముక్తిః’’ ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానంచేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యుజుర్వేదం గొప్పది. ద..
Mangalagiri Sri Panakala Narasimhaswamy's Brahmotsavam starts from today..
నేటి నుండి మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ..మంగళగిరి పానకాల నరసింహ స్వామి(క్షేత్రం).......మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నది. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం :ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉం..
"Sarvadevakrita Lakshmi Stotram".
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది.  సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ :   క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః దేవద..
పుత్రసంతానంకోసం“పుత్ర గణపతి వ్రతం ”
పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మంచి సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి.  చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదాంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదాంబ పార్వతీ దేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుత..
శ్రీరామ నామ స్మరణ ఫలితం
         పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినా రామనామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి.. వనేచరామః వసుచాహరామఃనదీన్తరామః నభయం స్మరామఃఇతీరయంతో విపినే కిరాతా ముక్తింగతాః రామపదానుషంగాత్‌!..అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి..
 Phalguna Masam visistatha  21-02-2023 to 21-03-2023 మంగళవారం వరకు
ఫాల్గుణమాసం విశిష్టత :[ 21-02-2023 మంగళవారం నుండి 21-03-2023 మంగళవారం వరకు ] శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణమాసం.  ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ✡️ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి.  ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక..
 21-02-2023:   Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam  |Yadadri
 21-02-2023: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారి బ్రహ్మోత్సవ ప్రారంభమ్శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. స్థల పురాణం:ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే త..
 Importance of Somvati Amavasya
 అమావాస్య! సోమవారంతో కలసి వచ్చినది!! బహుపుణ్య మహోదయకాలం!! ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం!  సోమావతి అమావాస్య  సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.  సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: 1. సోమావతీ అమావాస్య రోజున ..
మహా మృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం !ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌!! భావం:-‘‘అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి.’’మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనది. దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందిఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉ..
తెనాలిలో ముద్దపప్పు సప్తాహములు
పూర్వం మన తెనాలి రామలింగేశ్వర పేటలో, మణెమ్మ గారి మఠం లో ప్రతి ఏడాదీ, మాఘ మాసంలో 'వార్షిక ముద్దపప్పు సప్తాహం' ఘనం గా జరిగేది! తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాలనుండి వేద పండితులే కాక, ముద్దపప్పు ప్రియులు అయిన ఇతర  కులాలూ, వర్ణాల వారూ కూడా,   వేంచేసి, ఆ ముద్దపప్పు సప్తాహపు ఏడు రోజులూ, ముద్దపప్పు భోజనం, మఠం నిద్రా కావించి తిరిగి వెళ్ళేవారు!మాఘ శుద్ధ పాడ్యమి నాడు, చెయ్యి తిరిగిన నరసరావుపేట వంట వారు కొల్లూరు గ్రామపు పొలాలలో పండిన ఏడాది వయసుగల కందిపప్పు వాడి, బాగుగా గజ భగోణీలలో గోధుమ రంగు బారే వరకూ వేయించి, అటు పిదప బాగుగా ఉడకపెట్టి, ఉప్పూ, పసుపూ వేసి దివ్యమైన ముద్ద పప్పు వండేవా..
Maha Shivaratri Pooja Vidhanam
మహాశివరాత్రి పూజ నియమాలు , విధానం, విశిష్టత....!!18-2-2023 దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రాధాన్యమైనది. శివరాత్రి నెలకు ఒకటి చొప్పున్న పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి. వీటిల్లో మహాశివరాత్రి సంవత్సరకాలానికి ఒకటి మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి హిందువుల పండగలలో అత్యంత ప్రముఖమైనది.ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్ధి నాడు అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనపుడు సంభవిస్తుందని, పరమశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని  శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తముగా శివనామ ఆరాధనతో వ..
Why are bettel leaves used for tambulam?
తాంబూలానికి తమలపాకులనే.. ఎందుకు వాడతారు?హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత..హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం..
Srisailam Maha Shivratri Brahmotsavam
శ్రీశైలం పుణ్య క్షేత్రం నందు శ్రీ భ్రమరాంబికదేవీ సమేత  శ్రీ మల్లిఖార్జున స్వామివారి  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ..తేదీ : 14.02.2023 , మంగళవారం  సూర్యాస్తమయం అనంతరం , మయూర వాహనంపై ఆది దంపతులుశ్రీశైలం మహాజ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా, ప్రపంచకేంద్రంగా, వేదాలకు నిలయంగా,  భూమిపై కైలాసంగా వెలసిన ఘనత అంతా సుబ్రహ్మణ్యస్వామికి మరియు సుబ్రహ్మణ్య స్వామివారి వాహనమైన  మయూరానికే దక్కుతుంది. గణాధిపత్యం దక్కలేదని అలిగి శ్రీశైల క్షేత్రానికి తన మయూర వాహనంపై శ్రీశైలక్షేత్రానికి రావడంవల్ల పార్వతీ పరమేశ్వరులు కూడా  తన బిడ్డయైన సుబ్రమణ్యస్వామి..
Vijaya Ekadashi 2023 : విజయ ఏకాదశి
ఫిబ్రవరి 16వ తేదీ గురువారం విజయ ఏకాదశి సందర్భంగా...విజయం తథ్యంమాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని "విజయ ఏకాదశి" అంటారు. ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారిని విజయం వరిస్తుంది, పాపాలు తొలగి పునీతులవుతారని శ్రీకృష్ణుడు యుధిష్టిర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం. అలాగే విజయ ఏకాదశి విశిష్టత గురించి తెలపమని నారదుడు కోరగా బ్రహ్మ దేవుడు వివరించినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి.సీతాదేవిని రావణుడు అపహరించుకు పోయిన తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక శ్రీరాముడు దిగులు పడ్డాడు. ఒక ఋషి దగ్గరికి వెళ్లి ఈ పరిస్థితిలో తన కర్తవ్యం ఏమిటీ అని అడిగాడు. అప్పుడా ఋషి ఈ విధంగా వివరించాడు.ఏకాదశి ముందు రోజు అనగా దశమ..
Showing 295 to 308 of 842 (61 Pages)