Akshaya Tritiya Vishistatha

Akshaya Tritiya Vishistatha

అక్షయ తృతీయ ప్రాముఖ్యత


 వైశాఖ మాసం శుక్లపక్ష విదియను అక్షయ తృతీయగా పాటిస్తారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం. 

 శుక్ల పక్షము  తృతీయ అంటే తదియ, మూడవ తిధి రోహిణి నక్షత్రం తో కూడి ఉన్నపుడు  ఆ శుభ సందర్భాన్ని  అక్షయ తదియ అని అంటారు .

అందుకే ఈ రోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్య చంద్రులు 

అత్యంత ప్రకాశవంతంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని పండితులు అంటున్నారు.  


ఈ రోజున బంగారం,వెండి కొనుగోలు చేయడం ముఖ్యం కాదు చేసే దానాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అందుకే అక్షయ తృతీయ తెచ్చుకోవడానికే 

కాదు ఇవ్వడానికి కూడా అని తెలుసుకోవాలి. ప్రజాపతి సృష్టి ప్రారంభించింది ఈ రోజునే . వైశాఖ మాసం లో శుక్లపక్షం లో  పాడ్యమి నాడు

బ్రహ్మగారు ఆవిర్భవించారు. విదియ నాడు పరమాత్మ ఆయనకు వేదాధ్యయనము   చేయించారు . ఇంతకుముందు సృష్టి ఎలా ఉందో

అలాగే సృష్టినంతా కొనసాగించేందుకు నాంది  తదియ నాడు జరిగింది. అందుచేతనే అక్షయముగా సృష్టి జరుగుతూనే ఉంది.


అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు  చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం  


1 .   ఇదే  రోజున మరో విశేషం  ఏమిటి అంటే పరశురామ  ఆవిర్భావం జరిగింది.

2 .  కృష్ణ పరమాత్మ రేపల్లె వదిలి పెట్టి , మధురా నగరంలో  అడుగుపెట్టి న  రోజు .

3 .  లక్ష్మీదేవి తనకున్న 12 శక్తులని ప్రజాపతి ద్వారా  మిత్రవింద యజ్ఞము  అన్న ప్రక్రియ ద్యారా తాను పొందింది.  

      అంటే లక్ష్మీదేవి   సర్వశక్తులు  పొందినరోజు  అక్షయ తదియ .  

  


ఎప్పుడు కూడా దానం చేయడం మంచిదే. ఈ రోజు చేస్తే ఇంకా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు దానం ఇస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి.

శ్రీమహావిష్ణువును చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈరోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా మంచిదట. అయితే, అందరికీ అలా కుదరదు కాబట్టి. 

మనం స్నానం చేసేటప్పుడు మూడుసార్లు గంగా గంగా గంగా  అని పలికి స్నానం చేయాలి. అక్షయతృతీయ రోజున  ఓ  కొత్త  కుండలో గానీ, కూజాలో గానీ,

మంచి నీరు  పోసి, దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  జీవుడికి    దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు. 


అతిధులకు,అభ్యాగతులకు, పెరుగన్నంతో  కూడిన  భోజనం  సమర్పిస్తే,  ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన  రోజు  రాదు. వస్త్రదానం వల్ల 

తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు  సమర్పించుకుంటే,  మన  ఉత్తర జన్మలలో, వాటికి  లోటు  రాదు.

గొడుగులు, చెప్పులు,  విసన కర్ర  వంటివి  దానం  చేసుకోవచ్చు. 


అక్షయ తృతీయ నాడు చేసిన ఏ పుణ్య కార్యానికైనా సరే అక్షయం అంటే నశించిపోవడం

అన్నమాట ఉండదు.  ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా

మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి 

ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.