వరలక్ష్మీవ్రత పూజావిధానం
హిందూ స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరిందట. అప్పుడు పరమశివుడు వరలక్షీ వ్రతాన్ని గురించి తెలిపినట్లు వేదపండితులు తెలుపుతున్నారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేస్తారు. ముత్తైదువులు అందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మీవ్రతం రోజున మహిళలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇళ్ళు, వాకిళ్ళు శుభ్రపరిచి చిమ్మి ముగ్గులు పెట్టాలి. గుమ్మాలకు మంగళతోరణాలతో అలకరించుకుని, గడపలకు పసుపురాసి కుంకుమబొట్టు పెట్టాలి. తరువాత తలారా స్నానం చేసి ఇంట్లో తూర్పుదిక్కున మండపం ఏర్పరచుకుని, మండపానికి కూడా పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టుకోవాలి. ఆ మండపాన్ని అరటిపిలకలు, పువ్వులు, మామిడితోరణాలతో అలంకరించాలి. మండపంలో వెనుకవైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని గానీ, విగ్రహాన్ని గానీ ప్రతిష్టించుకోవాలి. (బంగారు, వెండి, రాగి) చెంబును శుభ్రంగా తోమి, పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పరచుకొని, కొత్త జాకెట్టు గుడ్డను కలశంలో పరచుకుని, కొబ్బరికాయకు పసుపురాసి కుంకుమబొట్టు పెట్టి కలశంపై పెట్టుకోవాలి. ముందుగా గణపతిని పూజించాలి.
గణపతి పూజ :
ఓం శ్రీగురుభ్యోన్నమః మహాగణాధిపతయే నమః, మహా సరస్వతాయే నమః, హరిహిఓమ్, దేవాంచ మజనయంత దే వాస్తాం విశ్వరూపా. పశవోవదంతి! సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు! అయం ముహూర్త సుముహూర్తోఅస్తూ!! యశ్శివో నామ రూపాభ్యాం యదేవి సర్వమంగళా! తయోసంస్మరణాత్పుమ్సాం సర్వతో జయమంగళం !!
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగంస్మరామి!!
యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్ధరః !
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ !!
స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే !
పురుషస్తమజంనిత్యం వాజామిన్హరణం హరిం !!
సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం !
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయత్నం హరిం !
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః !!
యేశామింది వరష్యామో హృదయస్తో జనార్థనః !
అపదామప హర్తారం దాతారం సర్వసంపదాం !!
లోకాభిరామం శ్రీరామం భుయోభుయోనమామ్యాహం!!
సర్వమంగళ  మాంగల్యే శివేసర్వార్థసాదికే!
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే!!
ఆచమ్య :
ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోగిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ కృష్ణ పరబ్రాహ్మణే నమః
ప్రాణాయాయం:
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే, ఓం భూః ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం తపః ఓం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓం మాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర పుద్ధిస్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే బహ్ర్త వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు ... సంవత్సరే, ... ఆయనే, ... మాసే, ... పక్షే, ... తిథౌ, ... వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ... నామధేయః (ధర్మపత్నీ సమేతః) మమ ధర్మార్థ కామోమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్థం, సర్వాభీష్ట సిద్ద్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలశారాధన : (కలశానికి గంధము, కుంకుమబొట్టు పెట్టి, ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశాన్ని మూసి ఈ మంత్రాన్ని చెప్పాలి)
శ్లో గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, ఆత్మానం, సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజాద్రవ్యములపై, తమపై అంతటా చల్లవలెను)
మం      ఓం అసునీతే    స్తిరోభవ !  వరదోభవ !  సుముఖోభవ !  సుప్రసన్నోభవ !  స్తిరాసనంకురు !
మం      ఓం గణానాం    శ్రీ మహా గణాధిపతయే నమః ! ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి ! పాదయో పాద్యం
సమర్పయామి ! హస్తయో అర్ఘ్యం సమర్పయామి ! శుద్ధ ఆచమనీయం సమర్పయామి !
మం      అపోహిస్తామ  శ్రీ మహా గణాధిపతయే నమః ! శుద్దోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి!
మం      అభివస్త్రా శ్రీ మహా గణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి! 
మం      యజ్ఞోపవీతం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి!
మం      గంధద్వారం శ్రీ మహా గణాధిపతయే నమః గందాన్దారయామి! 
మం      ఆయనేతే శ్రీ మహా గణాధిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్థం అక్షతాం సమర్పయామి!
అధఃపుష్పై పూజయామి
ఓం సుముఖాయనమః  ఓం ఏకదంతాయనమః  ఓం కపిలాయనమః  ఓం గజకర్ణికాయ నమః  ఓం లంభోదరాయనమః  ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః ఓం గణాధిపాయ నమః  ఓం దూమ్రాకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయా నమః ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః  ఓం శూర్పకర్ణాయ నమః ఓం హీరంభాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః   నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి
వనస్పతిర్భవైదూపై  నానాగంధైసుసంయుతం!
అఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యతాం!!
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దూపమాగ్రాపయామి
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం!
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే !
త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతే !!
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః దీపం దర్శయామి
దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
నైవేద్యం :
శ్లో         నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సయుతం!
            భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యతాం !!
            శ్రీ మహాగణాధిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి
ఓం ప్రాణాయస్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతాపితానమసి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, పూగిఫలై సమాయుక్తం ర్నాగావల్లీదళైర్యుతం, ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి
మం      హిరణ్యపాత్రం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి
శ్లో         సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః !
            లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః !!  
            దూమ్రాకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః !
            వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః !!
            షోడశైతాని నామని యఃపఠే చ్రునుయాదపి !
            విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా!
            సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థన్యనజాయతే!
           ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
శ్లో     యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే!! పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః !                      త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేనా శరణంమమ! తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః !!
         ఓం శ్రీ మహాగణాధిపతయే నమః  ఆత్మప్రదక్షణ నమస్కారం సమర్పయామి
శ్లో         యస్యస్మృత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు!
            న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం !!
            మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః !
            యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే !!
అన్యాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహా గణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు! ఉత్తరే శుభకర్మణ్య విఘ్న మస్థితి భావంతో బృవంతు !!
శ్రీ మహా గానాదిపతి ప్రసాదం శిరసా గృహ్యామి !!
మం      యజ్ఞేన     మహాగణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశయామి, శోభనార్దే పునరాగమనాయచ
వరలక్ష్మీ వ్రతం
ప్రాణ ప్రతిష్ఠ:
ఓం అసునీతే హి స్వామినీ, సర్వ జగన్నాయకే యావత్పూజావసానకం ప్రీతిభావేన కలశేస్మిన్ చేత్రేస్మిన్ సంనిన్దిమ్కురు, ఆవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నో భవ, వరదోభవ స్థిరాసనం కురు (అని పుష్పాక్షితలు కలశముపై, చిత్రపటముపై వేయాలి)
అధధ్యానం :
శ్లో         పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
            నారాయణప్రియే దేవి సుప్రీతా భావ సర్వదా!!
            క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే !
            సుస్థిరా భావమే గేహే సురాసుర నమస్కృతే !!
           శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ధ్యానం సమర్పయామి
శ్లో         సర్వమంగళ మంగళ్యే విష్ణు వక్షస్థలాలయే!
            ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భావ సర్వదా!!
            శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః మావాహయామి
శ్లో         సుర్యాయుత విభాస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!
            సింహాసనమిదం దేవీ గృహ్యతాం సమర్పయామి
           శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి
శ్లో       శుద్దోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం !
          అర్ఘ్యం దాస్యామితే దేవి గృహ్యతాం హరివల్లభే !!
          శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి
శ్లో       సువాసిత జాలం రమ్యం సర్వతీర్థం సముద్భవం !
          పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే !!
          శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పాద్యం సమర్పయామి
శ్లో        సువర్ణ కలశానీతం చందనాగురు సంయుతం !
            గృహాణాచమనం దేవి మయాదత్తం శుభాప్రదే !!
            శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి
శ్లో        పయోధది ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం !
            పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే !!
            శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి
శ్లో         సురార్చి తాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే !
            వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే !!
          శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
శ్లో         కేయూర కంకణాదేవి హర నూపుర మేఖలా!
            విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే !!
            శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ఆభరణాన్ సమర్పయామి
శ్లో         తప్త హేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం !
            మయాసమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదం !!
            శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః మాంగళ్యం సమర్పయామి
శ్లో         కర్పూరాగురు కస్తూరిరోచనాది సుసంయుతం !
            గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్వ శుభప్రదే!!
            శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః గంధం సమర్పయామి
శ్లో       అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ !
           హరిద్రా కుంకుమోపేతాన్ స్వీకురుష్వాబ్దిపుత్రికే !!
           శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి
శ్లో       మల్లికా జాజి కుసుమై శ్చమ్పక ర్వకులైరపి!       
          శాతపత్యైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే !!
          శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి
అథాంగ పూజ :
చంచలాయై నమః           - పాదౌ పూజయామి,  చపలాయై నమః             - జానునీ పూజయామి,  పీతంబరాయై నమః         -  ఊరూం పూజయామి
కమలవాసిన్యై నమః       - కటిం పూజయామి,  పద్మాలయాయై నమః     - నాభిం పూజయామి,     మదనమాత్రే నమః         - స్థనౌ పూజయామి
కుంభుకంట్యై నమః         - కంఠం పూజయామి, సుముఖాయై నమః        - ముఖం పూజయామి,   సునేత్రాయై నమః           - నేత్రౌ పూజయామి
రమాయై నమః               - కర్ణౌ పూజయామి,     కమలాయై నమః            - శిరః పూజయామి,       శ్రీ వరలక్ష్మై నమః      - సర్వాణ్యంగాని పూజయామి
| ఇక్కడ క్లిక్ చేయండి - వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి | 
శ్లో దశాంగం గగ్గులోపేతం సుగంధిం సుమనోహరం !
            ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గ్రుహాణతం !!
            శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః దూపమాఘ్రపయామి
శ్లో         ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం !
            దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితాభవ !!
            వరలక్ష్మీ దేవ్యై నమః దీపం దర్శయామి
శ్లో         నైవేద్యం షడ్రశోపేతం దాడిమాద్వాజ్య సంయుతం !
            నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
           శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి
శ్లో         పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం !
            కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం !!
           శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి
శ్లో         నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం !
            తుభ్యం దాస్యామాహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే !!
             శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి
శ్లో         పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే !
            నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా !!
           శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి
శ్లో         యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ           
            తాని తాని పుణ్యశంతి ప్రదక్షిణ పదేపదే !!
            పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ !   
             త్రాహిమాం కృపయాదేవి శరణాగతవత్సలా !!
            అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ !        
           తస్మాత్కారుణ్య భావేనా రక్ష రక్షజనార్థన !! 
          శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నమస్కారాన్ సమర్పయామి
| ఇక్కడ క్లిక్ చేయండి - తోర పూజ | ఇక్కడ క్లిక్ చేయండి - వరలక్ష్మి వ్రతకథ | 





 



					
Note: HTML is not translated!