Mella Cheruvu Swayambhu Lingeswara Swamy : Kodada

స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం: మేళ్ళచెరువు, కోదాడ, నల్లగొండ జిల్లా:

కాకతీయుల కాలం నాటి చారిత్రిక శివాలయం ప్రత్యేకమైనది ఎందుకంటే అక్కడి శివలింగం (1.83 మీటర్ల ఎత్తు 0.34మీ) చుట్టుకొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది ... నిత్యం స్వయం అభిషేకం జరుగుతుంటుంది.

శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం (చిత్రం రెండు, ఆరు) ఏర్పడుతూ ఉంటుంది. విధంగా చూస్తే మనకు కొన్ని సంవత్సరాల తరువాత వలయాల సంఖ్యలో పెరుగుదల మనకు స్పష్టంగా కనపడుతుంది. మొదట్లో కేవలం మూడు నామములు (చిత్రం నాలుగు) పెట్టే స్థలమే ఉండేదట. ప్రస్తుతం ఆరు నామములు (చిత్రం ఐదు) పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు, పెద్దవారు చెపుతుంటారు.

ఇంకొక విచిత్రమేమిటంటే శివలింగం పైభాగంలో చిన్న ఖాళీ (చిత్రం మూడు) ప్రదేశముంది. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ (చిత్రం తొమ్మిది) ఉంటుంది. నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ (చిత్రం తొమ్మిది)ఉబుకుతుంది. అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా. అందుకే ఇది స్వయం అభిషేక

లింగంగా చెప్పుకోవచ్చు. ఇది క్షేత్రంలో చాలా ప్రత్యేకం. నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ శాస్త్రీయమైన ఆధారాలూ లేవు. కానీ ఇది ఒక అద్భుతం. శివుని ఝటాఝూటంలో గంగాదేవిలాగ శివుని అభిషేకం చేయటం అద్భుతమే కదా. మన భారతదేశంలో కేవలం వారణాసిలో మాత్రమే ఇలా ఉందట. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు.

కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట. యాదవ కాపరి రాయిని శివలింగం అని తెలియక పదకొండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పారవేశాడట. కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ లింగం ప్రత్యక్షమై కనిపించిందట. అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగంగా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు.

ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు.

కాకతీయుల కాలమునకు సంబంధించిన ఆలయమునకు ఎందుకో ఎక్కువగా ప్రాచుర్యం లభించలేదు. ఆలయం కోదాడ దగ్గరలో ఉంది. జాతీయ రహదారి (నుండి కేవలం పది కి.మీ. లోపులో ఇక్కడకు చేరుకోవచ్చు)

0 Comments To "Mella Cheruvu Swayambhu Lingeswara Swamy : Kodada"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!