Vaishaka Pournami

Vaishaka Pournami

వైశాఖ పౌర్ణమి  విశిష్టత:


వైశాఖ పౌర్ణమినే మహావైశాఖి అని కూడా అంటారు. వైశాఖ మాసము తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది. నృసింహ జయంతి(వైశాఖ శుద్ధ చతుర్దశి) కి తరువాతిరేజు వచ్చే పౌర్ణమిని హిందువులు విశిష్టంగా భావిస్తారు.