Significance of Jammi Chettu - Importance of Devi Navaratrulu

దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం – ‘శమీపూజ’ కథ
 

దేవి అంటే ఒక దేవతాశక్తి. సర్వశక్తిమంతమైన ఈ దేవీ ఆరాధన తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, అంబ లేదా జగదంబగా, విశ్వానికి మాత;అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లిగా; సర్వమంగళ, అందరికీ  మంచి చేకూర్చే తల్లిగా; భైరవిగా; చంద్రిక లేదా చండిగా;  లలితగా;  భవానిగా;  మూకాంబికగా, ఈ తొమ్మిది రూపాలలో పూజించటం.

నవరాత్రిని సంవత్సరంలో నాలుగు సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి మరియు పౌష్య/మాఘ నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి మరియు వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.

వసంతకాలం మరియు శరదృతువుల మొదలు, వాతావరణపరంగా, సౌరప్రభావపరంగా చాలా ముఖ్యమైన సంధి కాలం. దేవీ మాతను పూజించడానికి ఈ రెండు కాలాలూ చాలా పవిత్రమైన అవకాశాలుగా భావిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ ‘దసరా‘ లేక ‘దేవీ నవరాత్రులు‘ అంటారు.

మొదటి మూడు రోజులు దేవిని మనలో ఉన్న అశుధ్ధాలను నాశనం చేయడం కోసం, ఒక ఆధ్యాత్మిక శక్తిగా వేరు చేస్తారు, ఆ శక్తిని దుర్గ అనీ, కాళి అనీ గుర్తిస్తారు. రెండవ మూడు రోజులు దేవిని ఆధ్యాత్మిక సంపదను ఒసగే లక్ష్మీ మాతగా ఆరాధిస్తారు. లక్ష్మీ మాత సంపదకు దేవత, ఆమెను తన భక్తులకు తరిగిపోని సంపదను ఇచ్చే శక్తిగల దేవతగా భావిస్తారు.  చివరి మూడు రోజులను చదువుల తల్లి అయిన సరస్వతిని పూజించడంలో గడుపుతారు. జీవితంలో అన్ని రంగాలలోనూ విజయం సాధించడానికి, ఆస్తికులు మూడు రకాల దైవిక స్త్రీత్వం యొక్క ఆశీర్వాదం పొందడం కోసం పూజిస్తారు, అందుకే తొమ్మిది రాత్రుల పూజ చేస్తారు.

ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

దుర్గాష్టమి:  దుర్గాదేవి “లోహుడు” అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. “దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 

‘గ’ అంటే నశింపచేసేది”, అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, ‘దుం’ అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. “ఈదుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము”, అని అంటారు.

మహర్నవమి:  మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున ‘సిద్ధదా’ అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

విజయదశమి:  దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే ‘విజయం’ అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

పురాణాల్లో జమ్మి
‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసమందున్నపాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు 
విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాదించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు , మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబందిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితి. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా’ దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు. 
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని,విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ 
క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

‘‘శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, 
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. 
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా, 
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే."

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. అంతేగాక శమీవృక్షం అగ్ని కాంతికి ప్రతీక. ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ శుభకరమైనవే.

వినాయక చవితి రోజు జమ్మిచెట్టు ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.

జమ్మిచెట్టు పూజ
శమీ పూజ ఎప్పటినుండి మొదలైందో తెలియదు కాని "అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం" అనేదానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీవృక్ష పూజతో 
సంబంధముందని తెలుస్తుంది. అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీవృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు భారతకథ కూడా నిదర్శనమంటారు. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచి పెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తన్ను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే.

జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీని వ్యవహార నామం ‘జమ్మి’. విరాట పర్వంలో పాండవులు మారువేషాలు ధరించినప్పుడు తమ ఆయుధాలను శమీ వృక్షం మీదనే దాచారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. 

"ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి". దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. "ఓం ఇభవక్త్రాయ నమః - శమీ పత్రం సమర్పయామి"

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాదించి రాజ్యాధికారం సాధిస్తారు.

ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు , మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబందిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితి. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 12 వది.

" శమీ శమయితే పాపం
శమీ శతృ వినాశనీ
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శనీ "
అనే శ్లోకం చదువుతారు.

నవరాత్రి సమయంలో, కొంతమంది దుర్గామాత భక్తులు దుర్గాదీక్షతో ఉపవాసాలు ఉండి, ఆరోగ్యము, సంపదలను సంరక్షించమని ప్రార్ధనలు జరుపుతారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి, అంతఃశోధనకు, ప్రక్షాళనకు నవరాత్రిని సంప్రదాయికంగా చాలా శుభప్రథమైన మరియు ఆధ్యాత్మికమైన సమయంగా భావిస్తారు.

జీవితంలో విజయాలను పొందడానికి ప్రతిభ కన్నా, అవకాశాల కన్నా గురితప్పని ఏకాగ్రత, లయ తప్పని దీక్ష తరగని ఓర్పు అవసరమనేది కలియుగ ధర్మం. అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించాలి. అందుకు మనోవాక్కాయముల చేత, ఇంద్రియాలతో, బుద్ధితో, ఆత్మప్రేరణతో, ప్రకృతి స్వభావం వలన చేసినదంతా భగవంతునికి అర్పించాలి. భగవంతుని సేవలో అచంచల విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి దీక్షను ఆచరించాలి.

భగవంతుని చింతనలో, సాత్విక జీవనం అవలంబించడం, ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం చాల శ్రేష్టం. 

కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ , సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే!

దుర్గాదేవి దీక్షలో తలక్షవరం, ముఖక్షవరం పనికిరాదు. గోళ్ళూ తీయకూడదు. నేలపైన లేక చాపపై లేక నేలపై కొత్తదుప్పటిని పరుచుకుని నిద్రించాలి. తలదిండు కూడ ఉపయోగించకూడదు. భౌతిక సుఖాలకు దూరంగా ఉండాలి. తెల్లవారు ఝామున, సాయంత్రం కూడ తలకు చన్నీటి స్నానం చేసి విభూతి, చందనం, కుంకుమను ధరించి దీక్ష చేసే దుర్గాదేవి చిత్రం ఎదురుగా ఒక పీటపై అమర్చాలి.   రెండుపూటల దీపారధన చేసి అష్టోత్తర శతనామార్చనకానీ, శరణుఘోష, దైవనామాలను జపించుకుంటూ పూజ చేయవచ్చు. దీపారాధనకు నువ్వూలనూనె, ఆవునెయ్యి శ్రేష్టం. అలా కుదరనప్పుడు దొరికున నూనెతో దీపారాధన చేసి, పళ్ళును గానీ,టేంకాయకానీ, పాలను గానీ నైవేద్యం చేసి కర్పూర హారాతిని ఇచ్చి పూజను ముగించాలి.

సమయానుకూలతనుబట్టి దుర్గాదేవి ఆలయదర్శనానికి వెళ్ళొచ్చు. ఒకపూట మాత్రమే భోజనం చేసి రెండవనాటి రాత్రివేళ అల్పాహారాన్ని మాత్రమే సేవించాలి. సాత్వికాహారం, మితాహారం మాత్రమే సేవించాలి. మాంసాహారం, మద్యం, పొగతాగడం, జూదం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అబధ్ధాలను మాట్లాడకూడదు. మితభాషణం తప్పనిసరి. 

వ్యాపారంలో, ఉద్యోగంలో తలమునకలై ఉన్నప్పటికీ దైవచింతనను మానకూడదు. సత్కాలక్షేపంతో కాలాన్ని గడపాలి.

దుర్గాదేవిదీక్షలో శ్రధ్ధ, భక్తి, నమ్మకం ముఖ్యం. దీక్షాపరులు ఎదుటివారిలో దైవాన్ని దర్శించగలగాలి. స్త్రీలలో జగజ్జనని అయిన అమ్మవారిని దర్శించి, పూజ్యభావంతో వారిని గౌరవించాలి. దీక్షలో ఉన్నవారు ఎదురుపడినపుడు నమస్కారం చేసి, ‘పాదాభివందనం చేయడానికి కూడ వెనుకాడ కూడదు.

విరివిగా దానధర్మాలను చేయాలి. దీక్షలో అన్నదానం ముఖ్యం. ఎవరి శక్తినిబట్టి వారు పూజలు, భజనలు ఏర్పాటు చేసి, కనీసం నలుగురైదుగురు కన్న భోజనం పెట్టాలి. 

దుర్గాదేవిదీక్షలో ఉన్నఫ్ఫుడు చెప్పులు ధరించకూడదు. దుర్గాదేవిన్నామాని జపిస్తూ యాత్ర చేయాలి.

కొంతమందిస్వయంగా వంట చేసుకుని తింటుంటారు. మరికొంత మంది దుర్గాదేవిదీక్షా సమయంలో రాత్రిపూట కేవలం పళ్ళూ,  పాలు తీసుకునేవారు, ఉడికిన పదార్థాలను తీసుకోకుందా అటుకులు తినేవారు, టేబుల్ పైన భోజనం చేయనివారాంటూ దీక్షాపరులున్నారు. భక్తితో లలితా సహస్రనామ  పారాయణం చేయడం మంచిది.  మండల దీక్ష పూర్తి చేసుకుని, తీర్థయాత్ర చేసి, దుర్గాదేవికి ముడుపులు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాక, మెడలోని ముద్రమాలలను విసర్జించి,  అనంతరం దుర్గాదేవిదీక్షావస్త్రాలను  విడిచి మమూలు వస్త్రాలను ధరించి దుర్గాదేవి పూజ చేసినప్పుడే పూర్తి ఫలితాన్ని పొందగలమన్నది నిజం.

మానవ జీవితాన్ని అతడి ఆత్మ విశ్వాసం ప్రభావితం చేయగలిగినంతగా మరేదీ చేయలేదంటే … మనకు మనం విలువ ఇచ్చుకున్నప్పుడే ఇతరులు మనకు విలువనిస్తారనే సత్యాన్ని గ్రహించాలి. మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే!  “జీవానాం నరజన్మ దుర్లభం”  సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు. అట్టి మానవ జీవితం ఒక విజయవంతమైనదిగా, ఒక సంతోషవంతమైనదిగా, ఒక తృప్తివంతమైనదిగా ఉండాలంటే దుర్గాదీక్ష చేయటం ఒక చక్కని మార్గం.

 

 

Products related to this article

Namo Border zari  Kanduva ( Yellow) ( Pack of 2)

Namo Border zari Kanduva ( Yellow) ( Pack of 2)

Namo Border Kanduva (Yellow)Product Description:This is beautiful DivineTemples Namo border Kanduva  with zari  border. Fascinating and fashionable collection of Mens   Kanduva, wh..

$6.15

Padma Asanam (Big)

Padma Asanam (Big)

Padma Asanam..

$15.00

Designed Tamboolam (10 Pieces)

Designed Tamboolam (10 Pieces)

Designed Tamboolam..

$6.00

0 Comments To "Significance of Jammi Chettu - Importance of Devi Navaratrulu"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!