How To Get Theosophy.

దివ్యజ్ఞాన సముపార్జనకు మరో మార్గం

పంచాంగుళీ దేవీ సాధన

దివ్యజ్ఞానం అంటే పూర్వం మన దేవతలు, దేవా ఋషులు తపోజ్ఞానం వల్ల అపారమైన శక్తిసంపదలు సాధించి, వాటి ద్వారా తమ త్రినేత్రాలను తెరిచి, సాధారణమైన నేత్రాలకు కనిపించని విషయాలను కనుక్కునేవారు. దానినే దివ్యజ్ఞానం అని అంటారు. ఈ దివ్యజ్ఞానం సంపాదించడానికి మరొక మార్గం 'పంచాంగుళీ దేవీ ధ్యానం'.

పంచాగుళీ దేవీ సాధనకు ముహూర్తం ఎప్పుడు?

పంచాగుళీ దేవీ సాధనకు కార్తీకమాసంలో హస్తా నక్షత్రం ఉన్న సమయంలో, ఆ రోజు రాత్రి ఏదైనా శుభ ముహూర్తంలో సాధన ప్రారంభించవచ్చు, పంచాగుళీ దేవీ సాధన మార్గశిర మాసంలో హస్తా నక్షత్రం వచ్చినప్పుడు సాధన విరమించవచ్చు. ఏదైనా అనువైన స్థలం (స్వచ్చంగా, పవిత్రంగా, శబ్దాలకు, కాలుష్యాలకు దూరంగా)ఎంచుకోవాలి. నదీతీరాలు, చెరువుకట్టలు, గుడులు లేదా ఇంట్లోని ఏదైనా గాలీ, వెలుతురూ ఉండేది. స్నానం చేసిన తరువాత మంచి ముఖ్యమైన బట్టలు కట్టుకుని పంచాంగుళీ దేవీ సాధన చేయాలి.

సాధన చేసే సమయంలో తీసుకోవలసిన ముఖ్య విషయాలు?

పంచాగుళీ దేవీ స్థాపన ఏదైనా కొబ్బరికాయ మీద చిత్రపటాన్ని పెట్టుకోవడం ద్వారా చేయవచ్చు. సాధన ప్రారంభించిన తరువాత ప్రతీరోజూ ఒకే విషంగా నియమానుసారంగా పూజలు, మంత్రాలు, జపతపాలు చేయాలి. మళ్ళీ హస్తా నక్షత్రం వచ్చే వరకు సాధన చేయాలి, మధ్యలో మానకూడదు. ప్రతిరోజూ 108 సార్లు (జపమాల) మంత్రపఠనం చేయాలి.

సాధనకు ముందే మంత్రాన్ని కంఠస్థం చేసుకోవాలి, మంత్రోచ్చరణ సరిగా చేయాలి. సాధనా కాలంలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాఠించాలి, శుద్ధ శాఖాహారాన్ని మాత్రమే భుజించాలి, మనోవాక్కాయ కర్మల శుద్ధిగా ఉండండి, సంధ్యావందనం తప్పక చేయాలి.

సాధన కోసం బ్రహ్మముహూర్తం ప్రాతఃకాలం (ఉదయం 4:00 – 4:30) శ్రేష్ఠం.

సాధన మీద పూర్తిగా విశ్వాసం ఉంచి, భక్తిశ్రద్ధలతో చేయాలి.

సాధన పూర్తయిన తరువాత ప్రతిరోజూ, మంత్రాన్ని ఏడుసార్లు పఠించాలి.

ప్రతిరోజూ మీ హస్తాన్ని చూసి మనసులో నమస్కరించుకోవాలి. అది సకల శక్తుల నిలయం అని నమ్మాలి.

పంచాంగుళీ దేవీ ధ్యానం:

ఓం పంచాంగుళీ మహాదేవీ శ్రీ సీమంధర శాసనే

అధిష్టాత్రీ కరస్వత్సా శక్తి:శ్రీత్రి దేశేశితు:

పంచాంగుళీ దేవీ మంత్రం:

ఓం నమో పంచాంగుళీ, పంచాంగుళీ,పరాశరీ పరాశరీ,

మాటా మంగళ వశీకరణీ లేహమాయి దండమోదనీ,

చౌంసట్ కామన విదారణీ,

రణమధ్యే రావలమధ్యే భూమధ్యే భూతమధ్యే ప్రేతమధ్యే పిశాచమధ్యే కోటింగ మధ్యే,

ఢాకినీమధ్యే శాకినీమధ్యే యక్షణీమధ్యే దోషణీమధ్యే గుణీమధ్యే గరుడీమధ్యే కునారీమధ్యే దోషాభరణమధ్యే

దుష్టమధ్యే ఘోరకష్ట మత్కరే తత్ చింతే చిత్తావే తస్మాథే

శ్రీ మాతా పంచాంగుళీ దేవీ తణే వజ్రని ఘాత్ పడే ఓం ఠం ఠం ఠం ఠం స్వాహ!

Products related to this article

Herbal Bath Powder

Herbal Bath Powder

Herbal Bath Powder ..

$2.00

Job Joining Muhurtham

Job Joining Muhurtham

Job Joining Muhurtham ..

$45.00

0 Comments To "How To Get Theosophy."

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!