Article Search

కామద ఏకాదశి వ్రతం
కామద ఏకాదశి వ్రతంకామద ఏకాదశి ని చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. దీనినే సౌమ్య ఏకాదశి , కామద ఏకాదశి , దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ , ఉపవాసం , జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది. పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది.స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమే అయినా ... దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస..
ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ
పద్మనాభ మాసము(ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ )బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదముఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో ! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను. శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను . ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ'ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును . ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను. ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల&n..
Holi Festivities Begin With 'rangbhari Ekadashi' In Kashi
కాశీ క్షేత్రాన్ని మహా స్మశానం అని పిలుస్తారు..ఇక్కడ ప్రతి ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుండి రంగ్ భరి పేరుతో మొదలై పౌర్ణమి వరకు హోళీ ఉత్సవాలు జరుగుతాయి.ఇక్కడ హోళీ కి ముందురోజు మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ల వద్ద కాలిన శవల నుండి వచ్చిన చితా భస్మము తో సాధు సంతులు, అఘోరాలు, నాగ సాధువులు హోళీ ఆడతారు వారి మనసు సాక్షాత్తు శివుడి తో నే హోళీ ఆడినట్టు భావిస్తారు.హరహరమహాదేవఈ ఉత్సవం చూడాలని చాలామంది వెళుతూ ఉంటారు అంత అద్భుతమైనది ఈ ఘట్టంఓమ్ నమః శివాయ....
అమలక ఏకాదశి సందర్భంగా
అమలక ఏకాదశి సందర్భంగాశ్రీ లక్ష్మీనారాయణాష్టకం.1)ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే ||2)అపారకరుణాంభోధిం ఆపద్బాంధవ మచ్యుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||3)భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వ గుణాకరమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||4)సుహృదం సర్వ భూతానాం సర్వ లక్షణ సంయుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||5) చిదచిత్సర్వ జంతూనాం ఆధారం వరదం పరమ్ |అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||6) శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||7)పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్ర శోభితమ్ | అశేష దుఃఖ శాంత్యర..
Vijaya Ekadashi 2023 : విజయ ఏకాదశి
ఫిబ్రవరి 16వ తేదీ గురువారం విజయ ఏకాదశి సందర్భంగా...విజయం తథ్యంమాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని "విజయ ఏకాదశి" అంటారు. ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారిని విజయం వరిస్తుంది, పాపాలు తొలగి పునీతులవుతారని శ్రీకృష్ణుడు యుధిష్టిర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం. అలాగే విజయ ఏకాదశి విశిష్టత గురించి తెలపమని నారదుడు కోరగా బ్రహ్మ దేవుడు వివరించినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి.సీతాదేవిని రావణుడు అపహరించుకు పోయిన తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక శ్రీరాముడు దిగులు పడ్డాడు. ఒక ఋషి దగ్గరికి వెళ్లి ఈ పరిస్థితిలో తన కర్తవ్యం ఏమిటీ అని అడిగాడు. అప్పుడా ఋషి ఈ విధంగా వివరించాడు.ఏకాదశి ముందు రోజు అనగా దశమ..
రేపు భీష్మ ఏకాదశి
మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు. గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ..
ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి
ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు.ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు, దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని ,  భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశ..
వైకుంఠ ఏకాదశి , ముక్కోటి దేవతలు ఎవరు
వైకుంఠ ఏకాదశి అను పండుగ పేరు రెండు పదాల కలియిక. వైకుంఠ , ఏకాదశి అను రెండు వేర్వేరు పదాలు. వైకుంఠం అనునది మన పురాణాల లో మహావిష్ణువు యొక్క నివాస స్థలముగా వర్ణించినారు. ఇక ఏకాదశి.  మనకు సంవత్సరానికి 24 ఏకాదశి లు వస్తాయి. పుష్య మాసం శుద్ద ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. మన వాడుక కాలెండర్ ప్రకారం నేడు 2-1-2023 న ముక్కోటి / వైకుంఠ ఏకాదశి.  మన పురాణాలలో ముక్కోటి ఏకాదశినాడు వైకుంఠ ద్వారాలు తెరువ బడుతాయి అని అంటారు. అందుకు వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువును , విష్ణు స్థానాన్ని కూడా సూచిస్తుంది.  చాక్చుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి  అవతర..
సఫల ఏకాదశి/ Saphala Ekadashi 2022
ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాం..  ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉవవసించి.. జాగరణ చేసి.. శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ , దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలు..

భీష్మ ఏకాదశి విశిష్టత ?

 

పగలుశుక్లపక్షంఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడుమాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజుభీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడుభీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు

ముక్కోటి ఏకాదశి పూజా విధానం

 

పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారుఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయిసూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు.

తొలి ఏకాదశి (ఈ) రోజున ఏం చేయాలి ? 

 

ప్రధమైకాదశి అను సంస్కృతి నామాన్ని బట్టి తెలుగు వారు దీనిని తొలి ఏకాదశి అని వ్యవహరి స్తున్నారు. సంవత్సరానికి 24 ఏకాదశులు... అందునా అధికమాసంలో ఇరవై ఆరు ఏకాదశు లు వచ్చినా ప్రధమైకాదశి, మహా ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశిని గొప్పగా చెప్పడానికి కారణాలు వున్నాయి.

 

Showing 1 to 12 of 12 (1 Pages)