Navaratri Dates Of 2016 and Apperances Of Durga Devi

 

దసరా మహోత్సవములు - 2016

నవరాత్రి (దసరా):

మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ, సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని మీకు తెలిసిన ముతైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి. ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి.

 

.సం వారము తిది శ్రీ అమ్మవారి అలంకరములు
01 -10- 2016 నివారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
02 -10- 2016 ఆదివారం  ఆశ్వయుజ విదియ   శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
03 -10- 2016 సోమవారం ఆశ్వీయుజ శుద్ధ విదియ (వృద్ధి) శ్రీ గాయత్రి దేవి
04 -10- 2016 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి
05 -10- 2016 బుధవారం ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి
06 -10- 2016 గురువారం ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
07 -10- 2016 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మీ దేవి
08 -10- 2016 శనివారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ  సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)
09 -10- 2016 ఆదివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గాదేవి
10 -10- 2016 సోమవారం ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి) శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
11-10-2016 మంగళవారం ఆశ్వీయుజ శుద్ధ దశమి (విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరీ దేవి

 

ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము,ఆ తల్లికి ఇష్టమైన రంగు.

 

వ.సం   శ్రీ అమ్మవారి అలంకరములు రంగు నైవేద్యం
1  శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి నీలం రంగు ఉప్పు పోంగల్
2  శ్రీ గాయత్రి దేవి పసుపు రంగు పులిహోర
3 శ్రీ మహాలక్ష్మి దేవి లేత రంగు  కొబ్బరి అన్నం
4 శ్రీ అన్నపూర్ణా దేవి  ఆకాషం రంగు  అల్లం గారెలు
5  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి  కనకంబరం రంగు  పెరుగన్నం
6  శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)  తెలుపు రంగు  రవ్వకేసరి
7 శ్రీ దుర్గా దేవి  మేరున్ రంగు (ముదురు ఎరుపు)  కదంబం (వెజిటబుల్, రైస్ కలిపి వండే ఐటం )
8 శ్రీ మహిషాసురమర్ధినీ దేవి  ఎర్రటి ఎరుపు రంగు  బెల్లమన్నం 
9  శ్రీ రాజరాజేశ్వరి దేవి  ఆకుపచ్చ రంగు  పరమాన్నం 

 

ఇలా 9 రోజులు తొమ్మిది రకాలనివేదనలు వంటకాలతో ఆ తల్లికి నివేదనలు​ చేసి ప్రసన్నులు కావచ్చు.

Related Articles

దుర్గా ఆపదుద్ధారాష్టకం 


నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||

 

దుర్గాద్వాత్రింశన్నామావళి


దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ || ౧ ||

 

దుర్గా సూక్తం

 

ఓం || జాతవే’దసే సునవా సోమ’ మరాతీతో నిద’హాతి వేదః’ |

స నః’ పర్-దతి’ దుర్గాణి విశ్వా’ నావే సింధుం’ దురితా‌உత్యగ్నిః ||

 

దుర్గా ఆపదుద్ధారాష్టకం

 

నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||


 

 

0 Comments To "Navaratri Dates Of 2016 and Apperances Of Durga Devi "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!