Lord Sun sadhana on makara sankranthi

మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప కోసం

 

మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప పొందడానికి 'భాగ్యోదయ సాధన' వల్ల సాధకుడు సూర్యుడికి కృపాపాత్రుడు అవుతాడు. సాధన ఎలా చేయాలంటేసూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు పూర్తిచేసుకుని సూర్యుడిని స్మరించుకుని, నమస్కరించాలి. శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఒక రాగిపాత్రలో నీటిలో నీళ్ళు పోసుకుని సూర్యుడికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి. సాధన రోజున ఉప్పు, నూనె లేని భోజనం చేయాలి. తూర్పుదిశకు అభిముఖంగా కూర్చుని, ఎదురుగా పీటపై పసుపురంగు పట్టువస్త్రం పరచి దానిపై సూర్యుడి పటం, లక్ష్మీ యంత్రం పెట్టుకోవాలి. సూర్యుడి పటానికి, లక్ష్మీ యంత్రానికి చందనం, కేసరం, వక్కలు, పూలు, సింధూరం అర్పించుకుని, సింధూరం మంచినీటితో రంగరించి, సూర్యనారాయణుని పటం, లక్ష్మీ యంత్రానికి రెండువైపులా సూర్యుని బొమ్మ గుర్తువేసి, పూలు సమర్పించిభగవాన్! నీవు సిందూర వర్ణం, తేజోవంతమైన ముఖమండలం, కమల నేత్రాలతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునితో సహా సృష్టికి మూలకారకుడవై ఉన్నావు. సాధకుని నమస్కారం గ్రహించు. నేను అర్పిస్తున్న కుంకుమ, పుష్పాలు, చందనయుత జాలం స్వీకరించు అని నివేథించాలి. రాగిపాత్రలోని నీటిని మూడుసార్లు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి, పూజా స్థానంలో సూర్యుని పటం, లక్ష్మీయన్త్రానీకి చుట్టూ 12 వక్కలు చక్రాకారంలో 12 సవితాచాక్రాలుగా స్థాపించాలి. 12వక్కలు సూర్యుని (ద్వాదశ) రూపాలు. ఒక్కొక్క దానిపై దాని శక్తికి ఒక్కొక్క పుష్పం నివేదించాలి. సూర్యుని ద్వాదశ స్వరూపాలను ధ్యానిస్తూ వాటిని పూజించాలి.

సూర్యుని ద్వాదశ నామాలువరుణ, సూర్య, సహస్రాంశు, ధాతా, తపన, సవితా, గభస్తిక, రవి, పర్జన్య, త్వష్టా, మిత్ర, విష్ణు.

సూర్యభగవానుడి పటానికి, లక్ష్మీ యంతానికి కేసరం, కుంకుమ నివేదించి, సాధకుడు దానినే తిలకంగా ధరించాలి. సూర్యమంత్రం

 

ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్య శ్రీమ్

 

11 మాలజపాలు చేయాలి. మంత్రజపం పూర్తయిన తరువాత పూజలో పెట్టిన దీపంతో హారతి ఇచ్చి, హారతిపై రెండు చేతులూ తీపి కళ్ళకు అడ్డుకోవాలి. తరువాత సూర్యుని పటాన్ని పూజామందిరంలో స్థాపించి లక్ష్మీ యంత్రాన్ని డబ్బుపెట్టెలో లేదా వ్యాపారస్థలంలో డబ్బులు పెట్టే స్థలంలో పెట్టుకోవాలి మిగిలిన పూజా సామాగ్రిని చెట్టుకింద లేదా నీటిలో వదిలిపెట్టాలి. సాధన పూర్తయిన తరువాత సాధకుడు నదిలో కానీ, చెరువులో కానీ స్నానం చేస్తే విశేషపుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సాధన పూర్తయిన తరువాత సాధకుడు తన శక్త్యానుసార

Products related to this article

Ganesha Car Hanging (Green)
Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

0 Comments To "Lord Sun sadhana on makara sankranthi "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!